కుమారి ఆంటీ డబుల్ ధమాకా.. సినిమాలో నటన.. ఫుడ్
Actor ProfileActor

కుమారి ఆంటీ డబుల్ ధమాకా.. సినిమాలో నటన.. ఫుడ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కుమారి ఆంటీ డబుల్ ధమాకా.. సినిమాలో నటన.. ఫుడ్ పై రూ. 100 డిస్కౌంట్ ఆఫర్
AP7AM18 Dec 2026
కుమారి ఆంటీ డబుల్ ధమాకా.. సినిమాలో నటన.. ఫుడ్ పై రూ. 100 డిస్కౌంట్ ఆఫర్

హైదరాబాద్‌ వీధుల్లో రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ సోషల్ మీడియాలో అనూహ్యమైన స్టార్‌డమ్ సంపాదించుకున్న కుమారి ఆంటీ ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. తన మాటతీరు, కస్టమర్లతో ఆప్యాయంగా పలకరించే విధానంతో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె.. 'పాంచాలి పంచభర్తృక' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రకటించిన ఓ వినూత్న ఆఫర్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సినిమా టికెట్ చూపించిన వారికి తన ఫుడ్ స్టాల్‌లో బిల్లుపై రూ.100 డిస్కౌంట్ ఇస్తానని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు.హైదరాబాద్‌లో జరిగిన 'పాంచాలి పంచభర్తృక' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న కుమారి ఆంటీ ఈ ఆఫర్‌ను ప్రకటించారు. సినిమాను థియేటర్లలో చూసి, ఆ టికెట్‌ను తన ఫుడ్ కౌంటర్‌కు తీసుకువస్తే భోజనం బిల్లులో రూ.100 తగ్గిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని ఆమె కోరారు. ఈ ఆఫర్‌తో సినిమాకు ప్రచారం జరగడంతో పాటు, తన ఫుడ్ వ్యాపారానికి కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె మార్కెటింగ్ ఆలోచనను ప్రశంసిస్తున్నారు.ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి కుమారి ఆంటీ ఉద్వేగంగా మాట్లాడారు. తాను సినిమాల్లో నటిస్తానని కలలో కూడా ఊహించలేదని, సోషల్ మీడియా వల్లే తనకు ఈ అరుదైన అవకాశం లభించిందని అన్నారు. తనకు ఈ చిత్రంలో నటించే అవ‌కాశం కల్పించిన దర్శకుడు గంగ సప్తశిఖర