కేపీహెచ్ బీలో భూముల ధరలకు రెక్కలు.. వేలంలో గజానికి రూ.2.14 లక్షలు
Actor ProfilePolitician

కేపీహెచ్ బీలో భూముల ధరలకు రెక్కలు.. వేలంలో గజానికి రూ.2.14 లక్షలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేపీహెచ్ బీలో భూముల ధరలకు రెక్కలు.. వేలంలో గజానికి రూ.2.14 లక్షలు
Samayam Telugu21 Dec 2026
కేపీహెచ్ బీలో భూముల ధరలకు రెక్కలు.. వేలంలో గజానికి రూ.2.14 లక్షలు

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలో స్థలాల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. 15వ ఫేజ్‌లో నిర్వహించిన ప్లాట్ల వేలంలో గజం గరిష్ఠంగా రూ.2.14 లక్షలు పలికింది. కీలక ప్రాంతంలో ఉన్న నివాస స్థలాలకు డిమాండ్‌ఉన్నప్పటికీ వేలంలో పాల్గొనేందుకు ఆశించిన స్థాయిలో ఆసక్తి కనిపించకపోవడం గమనార్హం. మొత్తం 24 ప్లాట్లకు వేలం నిర్వహించగా.. 12 స్థలాలకే పోటీదారులు ముందుకు వచ్చారు. హౌసింగ్‌ బోర్డు పశ్చిమ డివిజన్‌ పరిధిలోని 15వ ఫేజ్‌ ప్లాట్లకు శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీ సామాజిక భవనంలో వేలం నిర్వహించారు. వేలంలో పలువురు బిడ్డర్లు పాల్గొని పలు స్థలాలకు పోటీ పడ్డారు. కొన్ని ప్లాట్లు గజం రూ.1.46 లక్షల చొప్పున కూడా ధర పలికాయి. అయితే మొత్తం ప్లాట్లతో పోలిస్తే పోటీ తక్కువగా ఉండటంతో వేలం ప్రక్రియ రెండు గంటల్లోపే ముగిసింది.అధికాదాయ వర్గాలకు కేటాయించిన నాలుగు ప్లాట్లలో రెండు స్థలాలు విక్రయమయ్యాయి. వాటిలో 266.66 గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్‌ నంబర్‌ 105కు అత్యధిక డిమాండ్‌ కనిపించింది. ఈ ప్లాట్‌కు గజం రూ.2.14 లక్షల ధర పలకడంతో హౌసింగ్‌ బోర్డు అధికారులు నిర్ణయించిన ధరలపై ఆసక్తి నెలకొంది. హైదరాబాద్‌లోని ప్రముఖ నివాస ప్రాంతాల్లో స్థలాల కొరత, మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాల నేపథ్యంలో కేపీహెచ్‌బీకి ఇప్పటికీ మంచి డిమాండ్‌ ఉందని ఈ ధరలు సూచిస్తున్నాయి. వేలంలో మొత్తం 12 స్థలాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.39,30,04,251 ఆదాయం సమకూరింది. విక్రయమైన స్థలాల పరిమాణం, కేటగిరీ, బిడ్డింగ్‌లో నమోదైన ధరల ఆధారంగా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన ఆదాయం లభించింది. మరోవైపు మిగిలిన స్థలాలకు కూడా భవిష్యత్తులో నిర్వహించే వేలాల్లో మంచి ధర లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.నగరంలోని ప్రధాన రహదారులు, వాణిజ్య కేంద్రాలు, విద్యా సంస్థలు, మెట్రో, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలకు అనుసంధానం ఉండటంతో కేపీహెచ్‌బీలో స్థిరాస్తులకు డిమాండ్‌ కొనసాగుతోంది. దీంతో హౌసింగ్‌ బోర్డు ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చే స్థలాల