కొంప ముంచుతున్న ఫేక్ బడ్జెట్స్
Actor ProfileCelebrity

కొంప ముంచుతున్న ఫేక్ బడ్జెట్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొంప ముంచుతున్న ఫేక్ బడ్జెట్స్
10TV Telugu20 Oct 2026
కొంప ముంచుతున్న ఫేక్ బడ్జెట్స్

Movie Budget : కొంప ముంచుతున్న ఫేక్ బడ్జెట్స్.. ఇండస్ట్రీలో ఇప్పుడది హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇప్పుడు ఇది పెద్ద చర్చగా మారుతోంది. సినిమా కోసం పెట్టే బడ్జెట్ ఒకటైతే.. బయటికి చెప్పేది మాత్రం ఇంకో బడ్జెట్. ఇదో ట్రెండ్ అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది. అసలు సినిమా బడ్జెట్ కంటే, బయటకు చెప్పే ఫిగర్ మాత్రం భారీగా ఉండటంతో సినిమాపై ఆడియన్స్‌కు ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. రిలీజ్ తర్వాత ఆ రేంజ్‌లో క్వాలిటీ కనిపించకపోవడంతో ఇంత బడ్జెట్ పెట్టి ఇదేనా అవుట్‌పుట్.? అనే నెగెటివ్ టాక్ వెంటనే స్టార్ట్ అవుతోందట. ఇప్పటికే బాలీవుడ్‌లో రామాయణ్ మూవీకి రూ.4 వేల కోట్ల బడ్జెట్ అంటూ లీక్స్ రావడం, టాలీవుడ్‌లో మహేష్ బాబు వారణాసి ప్రాజెక్ట్ 1500 కోట్ల బడ్జెట్ అంటూ ప్రచారం జరగడం పెద్ద చర్చకు దారి తీసింది. ఇలా భారీ బడ్జెట్ అంటూ ప్రచారం జరగడం..రిలీజ్‌కు ముందు బిజినెస్ మీద కూడా ప్రభావం పడుతోందట. రిలీజ్ తర్వాత సినిమా కలెక్షన్స్ మీద కూడా ప్రెజర్ పెరుగుతోందట. చివరికి సినిమా కంటెంట్ కంటే బడ్జెట్ డిస్కషన్ ఎక్కువ అవుతుండటం మేకర్స్‌కే రిస్క్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది