కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Actor ProfilePolitician

కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Telugu Times14 Oct 2026
కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కెనడా పర్యటనకు సీఎం నేతృత్వంలోని బృందానికి ఆహ్వానం కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులను తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు ఆహ్వానించిన సీఎం రాష్ట్ర ప్ర‌గ‌తి దిశ, ఉద్యోగ కల్పనపై ప్రశంసలు కురిపించిన కెనడా హైకమిషనర్ హైదరాబాద్: కెనడా హైకమిషనర్ టు ఇండియా క్రిస్ కూటర్ బుధవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెనడా-తెలంగాణ మధ్య వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందాన్ని కెనడా పర్యటనకు రావాలని హైకమిషనర్ క్రిస్ కూటర్ ఆహ్వానించారు. ఈ సమావేశంలో తెలంగాణలో చేపడుతున్న భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ముఖ్యంగా మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ప్రతిష్ఠాత్మకంగా ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను ఇరువురు చ‌ర్చ‌లు జ‌రిపారు. తెలంగాణ-కెనడా మధ్య పెరుగుతున్న పారిశ్రామిక, ఆర్థిక సంబంధాలను ప్రస్తావించిన క్రిస్ కూటర్, ఇటీవల కెనడాకు చెందిన ప్రముఖ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్, హైదరాబాద్‌లో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, సీఐబీసీ (సీఐబీసీ) హైదరాబాద్‌లో తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించడం వంటి పరిణామాలు తెలంగాణపై కెనడా కంపెనీల న‌మ్మ‌కం, విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. దాంతోపాటు, ప్రపంచ ప్ర‌సిద్ధి చెందిన క్యాపిట‌ల్ సంస్థ సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్ హైదరాబాద్‌కు చెందిన సీటీఆర్ ఎల్ఎస్‌(CtrlS) డేటా సెంటర్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుని ఒక బిలియన్ కెనడియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం తెలంగాణ పెట్టుబడి సామర్థ్యాన్ని మరింత బలపరిచిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఐటీ, లైఫ్ సైన్సెస్, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో సాధించిన పురోగతిని