
కేంద్ర కేబినెట్‌లో మార్పులు, చేర్పులు జరుగుతాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే 2014 నుంచి మోదీ ప్రభుత్వంలో జరిగిన మార్పుల ప్రకారం ఓ స్పష్టమైన విధానం కనిపిస్తుంది. హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల వంటి కీలక వ్యూహాత్మక శాఖలు చాలా స్థిరంగా కొనసాగగా.. ప్రజలతో నేరుగా ముడిపడి ఉన్న సామాజిక రంగాలు, ఇతర శాఖల్లో మాత్రం తరచూ మంత్రులు మారుతూ రావడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ మినహాయిస్తే.. 2014 నుంచి రక్షణ వ్యవహారాల శాఖలో కొనసాగుతున్న మంత్రి రాజనాథ్ సింగ్‌తో పాటు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ స్థిరంగా కొనసాగుతున్నారు.కీలక శాఖల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్ మోదీ కేబినెట్‌లో అమిత్ షా ఎక్కువ కాలం పనిచేసిన హోం మంత్రిగా రికార్డు సృష్టించగా.. ఎస్.జైశంకర్ స్వతంత్ర విదేశాంగ మంత్రిగా ఎక్కువ కాలం బాధ్యతలు నిర్వహించిన నాయకుడిగా నిలిచారు. ప్రధానిగా ఉంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖను చూసుకున్న జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత జైశంకర్‌దే ఇక్కడ సుదీర్ఘ కాలం కావడం విశేషం. ఇక ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా 8 బడ్జెట్‌లను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. రాజ్‌నాథ్ సింగ్ దేశంలోనే రెండో అత్యంత సుదీర్ఘ కాలం పనిచేసిన రక్షణ మంత్రిగా నిలిచారు. మోదీ మొదటి విడత సర్కారులో అరుణ్ జైట్లీ అనారోగ్యం, మనోహర్ పారికర్ గోవా సీఎంగా తిరిగి వెళ్లడం వంటి కారణాల వల్ల మాత్రమే ఆర్థిక, రక్షణ శాఖల్లో మార్పుల చేయాల్సి వచ్చింది.సమాచార, ప్రసార శాఖలు అత్యధిక మార్పులు 2014 నుంచి మోదీ ప్రభుత్వం 5 సార్లు కేబినెట్ మార్పులు చేపట్టింది. ఇందులో చివరి పెద్ద మార్పు జులై 2021లో జరగగా.. ఆ తర్వాత 2023లో కేవలం ఒకసారి మాత్రమే కొన్ని శాఖలను మార్చారు. అయితే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో అత్యధికంగా మార్పులు జరిగాయి. 2014 నుంచి ఇప్పటివరకు ఆ శాఖకు ఏకంగా ఏడుగురు మంత్రులు మారారు. ప్రకాశ్ జవదేకర్