కేంద్రం అభీష్టానికి వ్యతిరేకంగా సీఎం విజయ్- నీట్
Actor ProfilePolitician

కేంద్రం అభీష్టానికి వ్యతిరేకంగా సీఎం విజయ్- నీట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేంద్రం అభీష్టానికి వ్యతిరేకంగా సీఎం విజయ్- నీట్ పై అసెంబ్లీలో తీర్మానం
Oneindia Telugu2 Dec 2026
కేంద్రం అభీష్టానికి వ్యతిరేకంగా సీఎం విజయ్- నీట్ పై అసెంబ్లీలో తీర్మానం

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు శాసనసభ మంగళవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని కోరింది. అధికార కూటమితో పాటు ప్రతిపక్షాలు కూడా ఈ తీర్మానానికి పూర్తి మద్దతును తెలియజేశాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే, వామపక్షాలు, పీఎంకే సభ్యులు ఈ తీర్మానానికి సానుకూలంగా ఓటు వేశారు. బీజేపీ ఎమ్మెల్యే మాత్రం వాకౌట్ చేశారు.ఈ తీర్మానాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కేజీ అరుణ్‌రాజ్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు అభ్యంతరాలను లేవనెత్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న నీట్ పరీక్ష విధానం సామాజిక న్యాయానికి, సమానత్వానికి భంగం కలిగించేదిగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాల విద్యా హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, సామాజికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే సువర్ణ అవకాశాలను నీట్.. పూర్తిగా దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.వైద్య విద్య ప్రవేశాల కోసం ఒక్క రోజులో రాసే పరీక్ష ఆధారంగా విద్యార్థుల భవిష్యత్, వారి అర్హతలను నిర్ణయించడం ఎంత మాత్రమూ సరైన పద్ధతి కాదని మంత్రి అరుణ్ రాజ్ స్పష్టం చేశారు. 12 సంవత్సరాల పాటు పాఠశాలల్లో విద్యార్థులు పడ్డ కష్టాన్ని ఈ విధానం పూర్తిగా తుడిచిపెట్టేస్తోందని అన్నారు. నీట్ ఆధారంగా మాత్రమే అడ్మిషన్లు ఇవ్వడం వల్ల విద్యార్థులు పాఠశాల చదువులపై శ్రద్ధ తగ్గించి, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గురువాయురప్పా.. ఒక్కరోజే 377 పెళ్లిళ్లా: ఆ ముహూర్తం మళ్లీ రాదునీట్ పరీక్ష ప్రవేశపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రైవేటు కోచింగ్ సెంటర్లు విపరీతంగా పెరిగిపోయాయని, అవి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను లూటీ చేస్తున్నాయని అరుణ్ రాజ్ ఈ తీర్మానంలో ఆరోపించారు. సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఖర్చులు భారం కావడంతో ప్రతిభ ఉన్నా పేద