కోతి వీడియోతో చిక్కుల్లో పడ్డ హీరో విక్రమ్
Actor ProfileActor

కోతి వీడియోతో చిక్కుల్లో పడ్డ హీరో విక్రమ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కోతి వీడియోతో చిక్కుల్లో పడ్డ హీరో విక్రమ్
Sakshi2 Dec 2026
కోతి వీడియోతో చిక్కుల్లో పడ్డ హీరో విక్రమ్

తమిళ స్టార్ హీరో విక్రమ్ చిక్కుల్లో ప‍డ్డారు. ఓ అరుదైన విదేశీ జాతి కోతితో కలిసి చేసిన వీడియోనే దీనికి కారణం. విమర్శలు రావడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే విక్రమ్ దానిని డిలీట్ చేశాడు. ఇంతకీ అసలేమైంది? ఏంటి వివాదం? (ఇదీ చదవండి: కలలో శివుడు.. ఇది సాధారణంగా అనిపించలేదు: పూరీ కూతురు) ఆదివారం హీరో విక్రమ్.. అరుదైన జాతికి చెందిన లార్ గిబ్బన్ కోతితో ఆడుకుంటున్న ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇందులో సదరు కోతిని అనుకరిస్తూ విక్రమ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. కొందరు దీన్ని చూసి లైక్ కొట్టగా మరికొందరు మాత్రం వన్యప్రాణి సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేశారు. అరుదైన జాతి కోతి.. విక్రమ్ దగ్గరకు ఎలా వచ్చింది? దీనిని పెంపుడు జంతువులా పెంచుకోవచ్చా అని పలు సందేహాలు రేకెత్తించారు.దీంతో విక్రమ్ తన వీడియోని డిలీట్ చేశాడు. విక్రమ్ తన వియ్యంకుడు(కూతురి మామ), ప్రముఖ బిజినెస్‌మ్యాన్ సీకే రంగనాథన్ ఇంటికి వెళ్లినప్పుడు ఈ కోతితో కలిసి వీడియో చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఆధారంగా అటవీశాఖ అధికారులు విచారణ మొదలుపెట్టినట్లు సమాచారం. సదరు కోతిని రంగనాథన్ ఎక్కడ కొనుగోలు చేశారు? వన్యప్రాణుల అక్రమ రవాణా ముఠా హస్తం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్ వీడియోలో కనిపించిన కోతి పేరు లార్ గిబ్బన్ (Lar Gibbon). ఇది అంతరించిపోయే దశలో ఉన్న జంతు జాతుల్లో ఒకటి. ఈ జాతికి సిటెస్(CITES) నిబంధనలతో పాటు భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కూడా రక్షణ ఉంది. అవసరమైన అనుమతులు, పత్రాలు లేకుండా లార్ గిబ్బన్‌ని పెంపుడు జంతువుగా ఉంచడం చట్టబద్ధమేనా? అని ఈ వీడియో వల్ల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రోజా రీఎంట్రీ సినిమా) కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు) కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం..(ఫొటోలు) ‘అగధ’