కొత్త సినిమా కోసం ఇస్కాన్ ఆలయంలో సన్నీ లియోన్ పూజలు.. 'చుడైల్' గా భయపెట్టేందుకు రెడీ
Actor ProfilePolitician

కొత్త సినిమా కోసం ఇస్కాన్ ఆలయంలో సన్నీ లియోన్ పూజలు.. 'చుడైల్' గా భయపెట్టేందుకు రెడీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొత్త సినిమా కోసం ఇస్కాన్ ఆలయంలో సన్నీ లియోన్ పూజలు.. 'చుడైల్' గా భయపెట్టేందుకు రెడీ
AP7AM31 Dec 2026
కొత్త సినిమా కోసం ఇస్కాన్ ఆలయంలో సన్నీ లియోన్ పూజలు.. 'చుడైల్' గా భయపెట్టేందుకు రెడీ

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన తదుపరి ప్రాజెక్టుల విజయం కోసం దైవ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి ముంబైలోని ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించారు. త్వరలో ప్రారంభం కానున్న తన కొత్త సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ ఆమె ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో సన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పింక్ కలర్ ఎంబ్రాయిడరీ సల్వార్ సూట్‌లో ఆమె ఎంతో హుందాగా కనిపించారు. ఆమె భర్త డేనియల్ గ్రీన్ షర్ట్, క్రీమ్ ప్యాంట్‌తో కనిపించారు.ప్రస్తుతం సన్నీ లియోన్ ఒకవైపు సినిమాలు, మరోవైపు అంతర్జాతీయ ప్రదర్శనలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటీవల ఆమె 'డీజే వరల్డ్ టూర్' పేరుతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ టూర్‌లో భాగంగా భారత్‌లోని ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి నగరాలతో పాటు థాయ్‌లాండ్‌, కెనడా, గ్లాస్గో, డబ్లిన్ వంటి అంతర్జాతీయ నగరాల్లోనూ తన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. త్వరలోనే ఆస్ట్రేలియాలో కూడా ఈ టూర్ జరగనుంది.ఇక సినిమాల విషయానికొస్తే, 'కెన్నడీ' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సన్నీ, ప్రస్తుతం 'చుడైల్' అనే హారర్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. టీఎల్‌వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్ దేవ్, మందన కరిమి ప్రధాన పాత్రలు పోషించారు. ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ వీధుల్లో తిరిగే ఒక దెయ్యం పాత్రలో సన్నీ కనిపించనుండగా, ఆమెకు పోటీగా