కొత్త స్కీమ్ ఎఫెక్ట్.. సగానికి
Actor ProfilePolitician

కొత్త స్కీమ్ ఎఫెక్ట్.. సగానికి

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
మీ బంగారం గురించి మా దగ్గర లెక్కలు లేవు.. లోక్ సభలో కేంద్రం ప్రకటన
Oneindia Telugu28 Nov 2026
మీ బంగారం గురించి మా దగ్గర లెక్కలు లేవు.. లోక్ సభలో కేంద్రం ప్రకటన

దేశంలో బంగారం, వెండి దిగుమతులపై పన్నులు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్ర ఖజానాకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. మే నెలలో పన్ను రేట్లను సవరించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు పదివేల

కొత్త స్కీమ్ ఎఫెక్ట్.. సగానికి పైగా కూలీలకు దక్కని పని
Oneindia Telugu27 Nov 2026
కొత్త స్కీమ్ ఎఫెక్ట్.. సగానికి పైగా కూలీలకు దక్కని పని

గ్రామీణ పేదలకు కొండంత అండగా ఉండే ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన కొత్త మార్పులు క్షేత్రస్థాయిలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పథకం స్థానంలో ప్రభుత్వం ఇటీవలే కొత్త పేరు, కొత్త నిబంధనలతో వికసిత్ భారత్ - జీ రామ్ జీ పథకాన్ని పట్టాలెక్కించింది. అయితే ఇది అమల్లోకి వచ్చిన మొదటి నెలలోనే ఉపాధి కూలీలకు గట్టి షాక్ తగిలింది. పల్లెల్లో ఉపాధి అవకాశాలు ఏకంగా సగానికి సగం తగ్గిపోయినట్లు అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి.గత జులై 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ నూతన ఉపాధి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. జులై నెల గణాంకాలను పరిశీలిస్తే, కూలీలకు కల్పించిన పని దినాల్లో ఏకంగా 49.94 శాతానికి పైగా కోత పడింది. గతేడాది జులైలో పాత పథకం కింద 15.33 కోట్ల పని దినాలు నమోదు కాగా, ఈ జులైలో కొత్త పథకం కింద అవి కేవలం 7.67 కోట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. చివరికి ఐదేళ్ల సగటుతో పోల్చి చూసినా ఇవి అత్యంత కనిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం.లక్షలాది కుటుంబాలకు దూరమైన పనిపని దినాలే కాకుండా, పథకం ద్వారా లబ్ధి పొందిన గ్రామీణ కుటుంబాల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. గతేడాది జులైలో దాదాపు 1.42 కోట్ల కుటుంబాలు ఉపాధి పనులు పొందగా, ఈసారి ఆ సంఖ్య కేవలం 68.94 లక్షలకు పడిపోయింది. అంటే ఏకంగా 51 శాతానికి పైగా పేద కుటుంబాలకు పని దొరకలేదని స్పష్టమవుతోంది. ఇది గత నాలుగేళ్ల సగటు పని పొందిన కుటుంబాల సంఖ్యలో 40 శాతం కంటే తక్కువ కావడం గమనార్హం.Video: ఉపాధి హామీ కూలీల మైండ్ బ్లోయింగ్ డాన్స్. ఆనందం అంటే ఇదే! వర్షాభావ వేళ రెట్టింపైన గ్రామీణ కష్టాలుఒకవైపు దేశవ్యాప్తంగా వర్షాలు సరిగ్గా పడక వ్యవసాయ పనులు మందగించాయి. దాదాపు సగానికి పైగా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్