
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Konda Surekha VS Kadiyam Srihari row: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కొంత మంది కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారుతున్నారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ గత కొన్ని నెలలుగా తరచుగా వివాదాల్లో ఉంటున్నారు. గతంలో హీరో నాగార్జున మీద వ్యాఖ్యలు, ఆతర్వాత పొంగులేటితో వివాదం, సీఎం రేవంత్ రెడ్డితో ఓఎస్డీ విషయంలో గొడవ, ప్రస్తుతం కడియం శ్రీహరితో వివాదం పీక్స్ కు చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు ఏమాత్రం సమాచారంలేకుండా తన శాఖకు చెందిన ఉన్నతాధికారులతో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే సమీక్షలు జరపాల్సిన అవసరం ఏంటని కొండా సురేఖ మండిపడ్డారు. ఇది బిజినెస్ రూల్స్ కి విరుద్దమన్నారు. కడియం గతంలో మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేశారని, ఎమ్మెల్యేగా ఇమడలేకపోతున్నారని, దమ్ముంటే మంత్రి పదవి తెప్పించుకొవాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని చెప్పుకుంటూ కాంగ్రెస్ తో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్, తెలంగాణ పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ లకు సైతం మంత్రి కొండా సురేఖ వరుస పెట్టి మరీ ఫిర్యాదు చేశారు. మరోవైపు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనదైన స్టైల్ లో కౌంటర్ లు వేశారు . తాను ఎక్కడ తప్పుచేయలేదని 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, కొండా సురేఖది అవగాహన రాహిత్యమని సెటైర్లు వేశారు. దీంతో ఈ వివాదంపై కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్దం నడుస్తొంది. తాజాగా.. కొండా సురేఖ