కొడాలి నానికి బిగ్ షాక్! బెడిసికొట్టిన
Actor ProfilePolitician

కొడాలి నానికి బిగ్ షాక్! బెడిసికొట్టిన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొడాలి నానికి బిగ్ షాక్! బెడిసికొట్టిన కామెంట్స్, చిక్కుల్లో మాజీ మంత్రి
Oneindia Telugu21 Oct 2026
కొడాలి నానికి బిగ్ షాక్! బెడిసికొట్టిన కామెంట్స్, చిక్కుల్లో మాజీ మంత్రి

ఏపీ రాజకీయాలు ఎంత సున్నితంగా మారాయంటే ఇటీవల మనం చూస్తున్న చిన్నచిన్న అంశాలే ఉదాహరణ. ఏవైపు నుంచి ఎవరిపై ఎటువంటి కేసులు పడతాయో చెప్పలేని స్థితికి వచ్చింది రాష్ట్రంలో తీరు. సోషల్ మీడియా వేదికలైనా, మీడియా సమావేశాలైనా ఒక్కమాట అందరితో సాదాసీదాగా మాట్లాడినట్లు మాట్లాడితే వెంటనే కేసులు పెడుతున్నారు. ఇటీవల యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారగా.. ఆయనకు సంఘీభావం తెలుపుతూ వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్ ఇప్పుడు ఆయన్ను చిక్కుల్లో నెట్టాయి.విజయవాడ వన్‌టౌన్ పీఎస్‌లో కొడాలి నానిపై ఉమ్మడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అంటూ హేళన చేశారని, ఈ నేపథ్యంలో చట్టాలపై గౌరవం లేకుండా మాట్లాడినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. అలాగే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటన్నింటిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కంప్లైంట్ లో కోరారు.అసలు కొడాలి నాని ఏమన్నారంటే..ఏడాదిగా పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించినందుకే ప్రశ్న రావణ్‌ను అరెస్ట్ చేశారు. మాది గొడ్డలి పార్టీ అని చంద్రబాబు అంటుంటే.. ప్రజలు మాత్రం మీ పార్టీని బూడిద పార్టీ అని మాట్లాడుకుంటున్నారు. మీరు గమనించినట్లైతే ప్రశ్న రావణ్ ను ఉప్మా చట్టమో.. ఇడ్లీ చట్టమో తీసుకువచ్చి అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. అతను మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్తగా మాట్లాడినవి కావు. రావణ్ వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వ్యక్తి. ఆయన లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబులకు అనుకూలంగా పనిచేస్తుంటారు. అందుకే ఆయన ఎప్పుడూ టీడీపీ నేతల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. టీడీపీ సోషల్ మీడియా అసత్య కథనాలతో రావణ్‌ను వైసీపీ ఖాతాలో వేయాలని చూస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంపై రావణ్ ఎన్నో విమర్శలు చేసినప్పటికీ, ఆయనపై అణచివేత చర్యలకు మేము పాల్పడలేదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్