కోట్ల లీగల్ షాక్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. సీక్వెల్ మూవీ
Actor ProfileActor

కోట్ల లీగల్ షాక్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. సీక్వెల్ మూవీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కోట్ల లీగల్ షాక్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. సీక్వెల్ మూవీపై భారీ వివాదం
Zee Telugu13 Oct 2026
కోట్ల లీగల్ షాక్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. సీక్వెల్ మూవీపై భారీ వివాదం

Star Heroine:బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి చట్టపరమైన వివాదంలో చిక్కుకున్నారు. ఆమె కెరీర్‌లో భారీ విజయాన్ని అందించిన క్వీన్ చిత్రానికి రూపొందుతున్న సీక్వెల్ క్వీన్ 2 ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కింది. ఈ సినిమా హక్కుల విషయంలో ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ ఫాంటమ్ స్టూడియోస్ ముంబై కోర్టులో రూ.250 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2013లో విడుదలైన క్వీన్ చిత్రం కంగనా రనౌత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. వికాస్ బహల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత అదే కథకు కొనసాగింపుగా క్వీన్ 2 తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమై తొలి షెడ్యూల్ కూడా పూర్తయినట్లు సమాచారం. అయితే ఈ సీక్వెల్ నిర్మాణంపై ఫాంటమ్ స్టూడియోస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమకు క్వీన్ చిత్రానికి సంబంధించిన హక్కుల్లో 50 శాతం వాటా ఉందని, అదే కథకు సీక్వెల్ లేదా సంబంధిత ప్రాజెక్ట్ రూపొందిస్తే తమ అనుమతి తప్పనిసరి అని సంస్థ కోర్టుకు తెలిపింది. కానీ క్వీన్ 2 నిర్మాణం ప్రారంభించే ముందు తమను సంప్రదించలేదని ఆరోపించింది. తమకు సమాచారం అందిన తర్వాత పలుమార్లు జియోస్టార్ సంస్థను సంప్రదించినప్పటికీ స్పందన రాలేదని ఫాంటమ్ స్టూడియోస్ పేర్కొంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని సంస్థ తన పిటిషన్‌లో వివరించింది. ఫాంటమ్ స్టూడియోస్ దాఖలు చేసిన పిటిషన్‌లో రూ.250 కోట్ల నష్టపరిహారం కోరడంతో ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఈ కేసు ముంబై కోర్టు పరిధిలో ఉండగా, త్వరలో విచారణ ప్రారంభం కానుంది.ఇదిలా ఉండగా, క్వీన్ చిత్రం అప్పట్లో సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై దాదాపు రూ.95 కోట్లకు పైగా వసూళ్లు