కోట్ల రాజభవనంలో ప్రభాస్ పెళ్లి జరగబోతోందా? కాబోయే భార్యకు రెబల్ స్టార్ సర్ ప్రైజ్ ? నిజమెంత
Actor ProfileActor

కోట్ల రాజభవనంలో ప్రభాస్ పెళ్లి జరగబోతోందా? కాబోయే భార్యకు రెబల్ స్టార్ సర్ ప్రైజ్ ? నిజమెంత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కోట్ల రాజభవనంలో ప్రభాస్ పెళ్లి జరగబోతోందా? కాబోయే భార్యకు రెబల్ స్టార్ సర్ ప్రైజ్ ? నిజమెంత
Asianet News Telugu14 Oct 2026
కోట్ల రాజభవనంలో ప్రభాస్ పెళ్లి జరగబోతోందా? కాబోయే భార్యకు రెబల్ స్టార్ సర్ ప్రైజ్ ? నిజమెంత

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి వచ్చే వార్తలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన కోకాపేట (ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్) పరిసరాల్లో ప్రభాస్ సుమారు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో.. ఒక విలాసవంతమైన రాజభవనాన్ని నిర్మిస్తున్నారనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక హంగులతో ఈ డ్రీమ్ హౌస్ నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం. అయితే, ఈ 200 కోట్ల బంగ్లాను ప్రభాస్ త్వరలోనే రాబోయే తన భార్యకు కానుకగా ఇవ్వబోతున్నారని, అందుకే ఈ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అంతే కాదు వచ్చే ఏడాది ప్రభాస్ ఒక బిజినెస్‌మెన్ కుమార్తెను పెళ్లాడబోతున్నారని, పెళ్లి పనులను ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి గారే దగ్గరుండి చూసుకుంటున్నారనే రూమర్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. పెళ్లి సమయానికి ఈ రాజభవనం పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ కుటుంబ సభ్యులు. పెళ్లవ్వగానే భార్యతో ఆ ఇంట్లోకి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నట్టు రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే కోకాపేటలో ప్రభాస్ ఒక లగ్జరీ ఇల్లు నిర్మిస్తున్న మాట నిజమే.. కానీ ప్రభాస్ పెళ్లిపై వస్తున్న వార్తల్లో మాత్రం నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రభాస్ కానీ, ఆయన టీమ్ నుంచి కానీ..ఈ విషయంలో ఎటువంటి అప్ డేట్ రాలేదు. ప్రభాస్ పెళ్లిపై ప్రతీ సీజన్ లో ఇలాంటి న్యూస్ లు రావడం సాధారణమే. ఇక ఈసారి కొత్తగా కట్టబోయే ఇంటితో ముడిపెడుతూ...ప్రభాస్ పెళ్లి వార్తలు తెగ తిరిగేస్తున్నాయి. గతంలో చాలా సందర్భాల్లో పెళ్లి ప్రస్తావనలు వచ్చినా..'' చేసుకుంటాను.. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకలేదు'' అంటూ.. తప్పించుకున్నాడు స్టార్ హీరో. గతంలో కూడా అనుష్క శెట్టి, కృతి సనన్ వంటి హీరోయిన్లతో ప్రభాస్ పెళ్లి అంటూ అనేక వార్తలు వచ్చాయి