కోట్లు ఖర్చు పెట్టి కుక్కలా మారిన కోటీశ్వరుడు.. వైరల్ వీడియోలో నిజమెంత
Actor ProfileActor

కోట్లు ఖర్చు పెట్టి కుక్కలా మారిన కోటీశ్వరుడు.. వైరల్ వీడియోలో నిజమెంత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కోట్లు ఖర్చు పెట్టి కుక్కలా మారిన కోటీశ్వరుడు.. వైరల్ వీడియోలో నిజమెంత
Andhra Jyothy20 Nov 2026
కోట్లు ఖర్చు పెట్టి కుక్కలా మారిన కోటీశ్వరుడు.. వైరల్ వీడియోలో నిజమెంత

జపాన్‌కు చెందిన ‘జాసో’ అనే 26 ఏళ్ల కోటీశ్వరుడు కుక్కలా మారడం కోసం రూ. 220 కోట్లు ఖర్చు పెట్టి శస్త్రచికిత్సలు చేయించుకున్నాడంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. జాసో కుక్కలా కనిపిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇంటర్‌నెట్ డెస్క్: జపాన్‌కు చెందిన ‘జాసో’ అనే 26 ఏళ్ల కోటీశ్వరుడు కుక్కలా మారడం కోసం రూ. 220 కోట్లు ఖర్చు పెట్టి శస్త్రచికిత్సలు చేయించుకున్నాడంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. జాసో కుక్కలా కనిపిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలింది. కుక్కలా మారటం కోసం జాసో ఎలాంటి శస్త్రచికిత్సలు చేయించుకోలేదట. ఆ వివరాల్లోకి వెళితే.. టోకో(అసలు పేరు)కు చిన్నప్పటి నుంచి జంతువులా జీవించాలనే కోరిక ఉండేది. తన చిరకాల కోరికను నెరవేర్చుకోవటం కోసం ఆయన 'జెప్పెట్' అనే మోడలింగ్ సంస్థను సంప్రదించాడు. కుక్కలా కనిపించే 'కొల్లీ' కాస్ట్యూమ్‌ను ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు. ఆ కాస్ట్యూమ్ కోసం టోకో 20 లక్షల జపనీస్ యెన్లు మాత్రమే ఖర్చుపెట్టాడు. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే కాస్ట్యూమ్ విలువ రూ. 11 నుంచి 12 లక్షల రూపాయలు మాత్రమే. అయితే.. కొందరు పాత వీడియోను మళ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. టోకో కుక్కలా మారడం కోసం 220 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాడని, చాలా సర్జరీలు చేయించుకున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నటిపై అత్యాచారం.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్.. ఎయిర్‌ఇండియా ఫ్లైట్‌లో టర్బులెన్స్ ఉదంతం.. డోప్ టెస్టులో పైలట్ ఫెయిల్!