కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు జిమ్ లో స్వల్ప గాయం.. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స.. ఇప్పుడెలా ఉందంటే
Actor ProfilePolitician

కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు జిమ్ లో స్వల్ప గాయం.. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స.. ఇప్పుడెలా ఉందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు జిమ్ లో స్వల్ప గాయం.. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స.. ఇప్పుడెలా ఉందంటే
Samayam Telugu5 Oct 2026
కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు జిమ్ లో స్వల్ప గాయం.. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స.. ఇప్పుడెలా ఉందంటే

Kalvakuntla Himanshu Gym Injury : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు స్వల్ప గాయాల పాలయ్యారు. జిమ్‌లో క్రమం తప్పకుండా చేసే వర్కవుట్స్ చేస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన హిమాన్షును తక్షణమే హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలియగానే బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురైనప్పటికీ.. అది చిన్నపాటి గాయమేనని, ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారని కుటుంబ సభ్యులు, వైద్య వర్గాలు స్పష్టం చేశాయి.జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా గాయం.. ఆస్పత్రికి క్యూ కట్టిన నేతలు!సోమవారం సాయంత్రం వేళ హిమాన్షు ఎప్పటిలాగే జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా చిన్నపాటి ప్రమాదం జరిగి స్వల్పంగా గాయపడ్డారు. నొప్పి ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయనను ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య నిపుణులు హిమాన్షుకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్సను అందించారు. హిమాన్షు ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే తండ్రి కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తక్షణమే ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులను అడిగి హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. కాగా మనవడిని పరామర్శించేందుకు మాజీ సీఎం కేసీఆర్ కూడా మరికాసేపట్లో ఆస్పత్రికి రానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది."నేను కోలుకుంటున్నాను": ఎక్స్ వేదికగా హిమాన్షు ట్వీట్!మరోవైపు తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఎలాంటి వదంతులు రాకుండా ఉండేందుకు హిమాన్షు రావు స్వయంగా స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. "గత రాత్రి జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా చిన్నపాటి గాయమైంది. దాని వల్లనే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను వేగంగా కోలుకుంటున్నాను. అయితే గాయం నుంచి పూర్తిగా ఉపశమనం పొంది, సాధారణ స్థితికి రావడానికి కొద్దిరోజుల