కంచె చేను మేసింది
Actor ProfilePolitician

కంచె చేను మేసింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కంచె చేను మేసింది
Eenadu21 Dec 2026
కంచె చేను మేసింది

తనిఖీకి వచ్చి..ఆభరణాలు కాజేసిన డీసీసీబీ మేనేజర్‌ చర్యలకు బదులు కేసు ఉపసంహరణకు యత్నం వికారాబాద్, న్యూస్‌టుడే: డీసీసీబీ మోమిన్‌పేట శాఖలో 96.1 గ్రాముల బంగారు ఆభరణాల తస్కరణ కేసు ఇంటి దొంగ పనేనని పోలీసులు తేల్చారు. దొంగను రక్షించడానికి తోటి అధికారులు చందమామ కథ సూత్రం పాటించారు. ఒక గదిలో డబ్బా పెట్టి అందులో ఆభరణాలు వేయాలని సూచించగా.. ఆ దొంగ చోరీ సొత్తు అందులో వేయడంతో అందరూ కలిసి కేసు రాజీ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక డీసీసీబీ శాఖను మరో శాఖ మేనేజర్‌తో తనిఖీ చేయిస్తారు. ఈ క్రమంలోనే జూన్‌ 20న మోమిన్‌పేట డీసీసీబీలో ఉన్న నగదు, బంగారు నిల్వల తనిఖీకి మరో డీసీసీబీ మేనేజర్‌ను పంపించారు. ఇన్‌ఛార్జి మేనేజర్‌ స్ట్రాంగ్‌ రూంలో ఉంచిన సొత్తు చూపించగా, అన్నీ సక్రమంగానే ఉన్నట్లు తేలింది. ఇక్కడే తనిఖీకి వచ్చిన మేనేజర్‌ చేతివాటం ప్రదర్శించారు. స్ట్రాంగ్‌ రూంలోని 96.1 గ్రాముల బంగారం మూడో కంటికి తెలియకుండా నొక్కేశారు. అదే నెల 22న సాధారణ తనిఖీల్లో భాగంగా ఆడిటర్ల బృందం మోమిన్‌పేట శాఖకు తనిఖీకి రావడంతో అసలు విషయం బయటపడింది. సమాచారాన్ని జనరల్‌ మేనేజర్‌ ప్రభాకర్‌రెడ్డికి నివేదించగా, డీజీఎం సతీష్‌రెడ్డి ఫిర్యాదుతో ఎస్సై భరత్‌భూషణ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో చోరీ చేసింది తనిఖీకి వచ్చిన మేనేజర్‌ అని గుర్తించారు. కేసును నీరుగార్చడానికి రాజకీయ నాయకులు రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చోరీకి సొత్తు లభ్యమైందని, కేసును ఉపసంహరించుకోవడానికి డీసీసీబీ అధికారులు సిద్ధపడ్డారు. ఇందుకు చెప్పే కారణాలు చందమామ కథను తలపించాయి. అందరూ కూడబలుక్కొని మోమిన్‌పేట శాఖ కార్యాలయంలో రహస్యంగా ఓ డబ్బాను ఉంచారు. ఆభరణాలు ఆ డబ్బాలో వేస్తే ఎలాంటి కేసు ఉండదని హామీ ఇచ్చారు. ఆభరణాలు డబ్బాలో ప్రత్యక్షం కాగా, రాజీ పడి కేసు ఉపసంహరించుకుంటున్నట్లు పోలీసులకు తెలిపారు. అలా