
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Bandi Sanjay fires on cm revanth reddy govt: తెలంగాణ వ్యాప్తంగా స్వాంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నితాకాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు చెందిన నేతలు తమ తమ పార్టీ కార్యాలయాల మీద జాతీయజెండాల్ని ఎగురవేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఉన్న 2.77 కోట్ల ఎకరాల్లో ఏకంగా 95 లక్షల ఎకరాలను 22ఏ నిషేధిత జాబితాలో ఎలా చేరుస్తారని బండి సంజయ్ సీఎం రేవంత్ సర్కారుపై ఫైర్ అయ్యారు. స్మార్ట్ రేషన్ కార్డులపై సీఎం, మంత్రుల ఫోటోలు ఎందుకని, కాంగ్రెస్ ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వమంటూ సెటైర్లు వేశారు. కర్నాటకలో సిద్ధిరామయ్య హయాంలో వందల కోట్లతో తయారు చేసిన స్మార్ట్ కార్డులన్నీ నిరుపయోగమయ్యాయన్నారు. సిద్దరామయ్యపోయి డీకే శివకుమార్ సీఎంగా వచ్చారని, రేషన్ బియ్యం ఉచితంగా ఇచ్చేది మోదీ ప్రభుత్వమే కదాఅంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 57 లక్షల కార్డుదారులకు దాదాపు 2 కోట్ల మంది ఉచితంగా బియ్యం మోదీ ఇస్తోందన్నారు. మరీ మోదీ ఫోటో ఎందుకు పెట్టడం లేదని విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇచ్చే బియ్యం మీకు అవసరం లేదా? అని.. సొమ్ము ఒకడిది... సోకు ఇంకొకరిదా?.. అంటూ ఫైర్ అయ్యారు. దమ్ముంటే మోదీ ఇస్తున్న బియ్యం అవసరం లేదని కేంద్రానికి లేఖ రాసే దమ్ముందా? అంటూ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలోనూ ఇదే పరిస్థితినెలకొందని చెప్పారు. పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నిధులిస్తే