కింగ్డమ్ ' విలన్ ... తెలుగులోకి హీరోగా ఎంట్రీ
Actor ProfilePolitician

కింగ్డమ్ ' విలన్ ... తెలుగులోకి హీరోగా ఎంట్రీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కింగ్డమ్ ' విలన్ ... తెలుగులోకి హీరోగా ఎంట్రీ
Sakshi22 Nov 2026
కింగ్డమ్ ' విలన్ ... తెలుగులోకి హీరోగా ఎంట్రీ

విజయ్‌ దేవరకొండ 'కింగ్డమ్‌' సినిమాలో విలన్‌గా మెప్పించిన వెంకటేశ్‌ వీపీ.. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. పక్కా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న 'డీజీపీ' (వర్కింగ్ టైటిల్) మూవీలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. గోదావరిఖనికి చెందిన సురేశ్‌ తేజ్ దర్శకుడు కాగా శివ బొమ్మక్‌ నిర్మాత. (ఇదీ చదవండి: లోకేశ్ 'డిసి'.. విజయ్ దేవరకొండే చేయాలి కానీ) ఈరోజు (ఆగష్టు 9) వెంకటేశ్‌ వీపీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం అతడికి ఆహ్వానం పలుకుతూ వినూత్న రీతిలో వీడియో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వెంకీ.. మూవీ యూనిట్‌కు ధన్యవాదాలు తెలిపాడు. 'దాదాపు ఏడాది కాలంగా ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఎట్టకేలకు ఇది జరిగింది. రుద్రాంశ్‌ సెల్యూలాయిడ్‌తో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం. నా జీవితంలో దక్కిన ఈ సంతోషాలకు ఎంతో కృతజ్ఞుడిని. కొత్త ప్రయాణం మొదలు' అని వెంకీ భావోద్వేగానికి లోనయ్యాడు. కేరళకు చెందిన వెంకటేశ్‌ వీపీ బుల్లితెరపై యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుని ఒక్కోమెట్టు ఎక్కుతూ హీరోగా ఎదిగాడు. మలయాళంలో పలు సినిమాల్లో నటించిన అతడు కింగ్డమ్ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. మురుగన్‌ అనే విలన్‌ పాత్రలో ఒదిగిపోయాడు. తెలుగులో రెండో సినిమాతోనే హీరోగా అవకాశం దక్కించుకున్నాడు. (ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16) గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు) టాలీవుడ్ రాజకుమారుడు.. మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు) వేటపోతుకు ఇచ్చిన విలువ కూడా