
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యల తర్వాత పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) తాజాగా నీట్ అక్రమాలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై గట్టిగా పోరాడి ఆయనతో రాజీనామా చేయించింది. అయితే ీ టాస్క్ తర్వాత ఏం చేయాలి ? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో సమగ్ర చర్చల తర్వాత సీజేపీ (CJP) 12 మందితో ముందుగా ఓ టీమ్ ప్రకటించింది. ఇందులో అంతా సీఏలు, లాయర్లు, ఐఐటియన్లు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలే. తాజాగా మహారాష్ట్రలో నిర్వహించిన 2 రోజుల భేటీ తర్వాత సీజేపీ వీరి పేర్లు, వివరాలు ప్రకటించింది.డీలిమిటేషన్ బిల్లు వేళ కేంద్రానికి ఝలక్..! టీఎంసీ రెబెల్స్ యూటర్న్..!కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించిన 12 మంది టీమ్ లో ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్, ఇంజనీర్లు, న్యాయవాదులు, ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లు, జర్నలిస్టులు, ఒక పారిశ్రామికవేత్త, ప్రజా పరిపాలన, విధాన రూపకల్పన, సాంకేతికత, వ్యాపార రంగాలలో అనుభవం ఉన్న నిపుణులు ఉన్నారు. ఇందులో ముందుగా పార్టీ వ్యవస్దాపకుడు, జాతీయ కన్వీనర్ అయిన అభిజిత్ దిప్కే మహారాష్ట్రలోని శంభాజీ నగర్‌కు చెందిన వారు. పూణేలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ, అలాగే అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. అలాగే సహ కన్వీనర్ గా ఉన్న అశుతోష్ రంకా రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన వారు. ఐఐటీ కాన్పూర్ నుండి బీటెక్ పట్టా పొందారు. దీంతో పాటు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ కూడా చేశారు. మరో సహ కన్వీనర్ సౌరవ్ దాస్ ఢిల్లీకి చెందిన వారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేశారు.వీరు కాకుండా జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గా నియమించిన అజింక్య షిండే మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన వారు. లోనెరేలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DBATU) నుండి బీటెక్ పట్టా పొందారు