
‘ఆకలితో అలమటిస్తుందోమోగానీ పులి గడ్డి మాత్రం తినదు’ అంటుంటారు. మాంసాహార జంతువు మార్జాలమూ అంతేగా! ఎలకలు, పక్షుల్ని వేటాడి కడుపు నింపుకొంటుంది. కానీ చిత్రంగా ఈ చిత్రంలోని పిల్లి ఆకులు తింటోంది. పచ్చని గడ్డి పరపరా నమిలేస్తోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లో ఓ దుకాణం వెనకాల ఇటీవల కురిసిన వర్షాలకు మొలిచిన గడ్డిని ఆరగిస్తోంది. జీర్ణక్రియకు, కడుపులోని హెయిర్‌బాల్స్ వాంతి ద్వారా బయటకు వెళ్లేందుకు సహాయపడుతుందన్న ఉద్దేశంతో అప్పుడప్పుడూ పిల్లులు గడ్డి తింటాయని అసలు విషయం వివరించారు కరీంనగర్ నగరపాలక సంస్థ పశు వైద్యాధికారి వై.దుర్గాప్రసాద్‌రెడ్డి. అయితే ఇది అరుదని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు