ఔటా.. నాటౌటా? తిలక్ వర్మ వివాదాస్పద వికెట్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే
Actor ProfilePolitician

ఔటా.. నాటౌటా? తిలక్ వర్మ వివాదాస్పద వికెట్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఔటా.. నాటౌటా? తిలక్ వర్మ వివాదాస్పద వికెట్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే
TV9 Telugu7 Oct 2026
ఔటా.. నాటౌటా? తిలక్ వర్మ వివాదాస్పద వికెట్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే

Tilak Varma Stumping Controversy: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అవుటైన తీరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ఈ వివాదం కాస్తా పెద్దదిగా మారింది. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అవుటైన విధానం సరికొత్త వివాదానికి దారితీసింది. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేసిన స్టంపింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ అభిమానులు సోషల్ మీడియాలో అంపైర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. భారత జట్టు కేవలం పవర్‌ప్లే లోనే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో తిలక్ వర్మ క్రీజులోకి వచ్చారు. ఇంగ్లాండ్ స్పిన్నర్ విల్ జాక్స్ వేసిన ఒక వేగవంతమైన బంతిని భారీ షాట్ ఆడటానికి తిలక్ క్రీజు వదిలి ముందుకు వచ్చారు. అయితే బంతి వేగాన్ని అంచనా వేయడంలో విఫలం కావడంతో అది బ్యాట్‌కు దొరకకుండా నేరుగా వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతుల్లోకి వెళ్ళింది. తిలక్ క్రీజు వెలుపల ఉండటాన్ని గమనించిన బట్లర్ వెంటనే వికెట్లను పడగొట్టాడు. ఇది కూడా చదవండి: టాస్‌లో హీరో.. మ్యాచ్‌లో జీరో.. టీమిండియా పాలిట విలన్‌లా మారిన శ్రేయాస్ అయ్యర్..! అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకుంది. బట్లర్ వికెట్లను పడగొట్టిన మరుక్షణమే బంతి అతని గ్లోవ్స్ నుంచి జారి కిందపడిపోయింది. దీంతో తిలక్ వర్మ నాటౌట్ అంటూ నెటిజన్లు రచ్చ చేయడం ప్రారంభించారు. కానీ రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ మాత్రం తిలక్‌ను అవుట్‌గా ప్రకటించారు. కేవలం 11 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి వైస్ కెప్టెన్ నిరాశగా వెనుతిరిగారు. ఈ వివాదంపై స్పష్టత రావాలంటే క్రికెట్ చట్టాలను రూపొందించే ఎంసీసీ (MCC Law)