
తెలంగాణలో అధికార పార్టీలో కలకలం. సొంత పార్టీ నేతల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. సీనియర్లు గళం విప్పుతున్నారు. పార్టీలో పరిస్థితుల పైన మండిపడుతున్నారు. అవినీతి పైన ఫైర్ అవుతున్నారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి తరహాలోనే తాను ఓపిన నశిస్తే తిరగబతానని పార్టీ మరో సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి హెచ్చరించారు. కోట్ల రూపాయాలు తింటున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు చిన్నారెడ్డి వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి.కాంగ్రెస్ సీనియర్ నేత జి చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్టీలో కొంత కాలంగా నేతలు ఓపెన్ గా చేస్తున్న కామెంట్స్ గా నాయకత్వానికి సమస్యగా మారుతున్నాయి. ఇప్పుడు పార్టీలో పరిస్థితుల పైన వారు చేస్తున్న వ్యాఖ్యలతో నాయకత్వం ఇరకాటంలో పడుతోంది. కొద్ది నెలల క్రితం తనకు జరుగుతున్న అవమానం.. పార్టీలో పరిస్థితుల కారణంగా సీనియర్ నేత జీవన్ రెడ్డ పార్టీ వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు జీవన్ రెడ్డి తరహాలోనే తాను తిరగబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు.సొంత పార్టీకే చెందిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బులతో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని.. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను అవినీతి పార్టీగా మార్చారని, తన పనులకు అడ్డుపడుతూ.. తన కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తనకు ఓపిక నశిస్తే మరో జీవన్‌రెడ్డిలా మారి తిరగబడతానని చిన్నారెడ్డి హెచ్చరించారు. కొత్త టీం సిద్దం, భారీ ప్రక్షాళన- పురందేశ్వరికి కొత్త బాధ్యతలు, బండి సంజయ్ కు ఇక..!!పార్టీలో చిన్నారెడ్డి వ్యాఖ్యల కలకలంపార్టీ నేతల సమక్షంలోనే చిన్నారెడ్డి తన ఆవేదన వెల్లగక్కారు. ఎమ్మెల్యే టికెట్ చిన్నారెడ్డికి ఇవ్వాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. రేవంత్‌రెడ్డికి చెప్పారు. ఆయన వద్ద డబ్బు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకోవాలని ఆదేశించారు. కానీ, పార్టీలోని ఎన్నికల కమిటీ డబ్బులకు ఆశపడి నాకు టికెట్ ఇవ్వలేదు అని చిన్నారెడ్డి చెప్పుకొచ్చారు. వనపర్తిని అవినీతినిమయంగా మార్చారని, తాను అభివృద్ధి పనులు చేపట్టాలనుకుంటే ఎమ్మెల్యే తన వారికే పనులు