ఓటు తొలగింపు వివాదం.. ప్రకాష్ రాజ్ బతికి ఉన్నారని నిరూపించుకోవాలన్న బీజేపీ నేత
Actor ProfileActor

ఓటు తొలగింపు వివాదం.. ప్రకాష్ రాజ్ బతికి ఉన్నారని నిరూపించుకోవాలన్న బీజేపీ నేత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఓటు తొలగింపు వివాదం.. ప్రకాష్ రాజ్ బతికి ఉన్నారని నిరూపించుకోవాలన్న బీజేపీ నేత
Samayam Telugu10 Dec 2026
ఓటు తొలగింపు వివాదం.. ప్రకాష్ రాజ్ బతికి ఉన్నారని నిరూపించుకోవాలన్న బీజేపీ నేత

బెంగళూరులో ఓటరు జాబితాలో నుంచి తన ఓటు తొలగించారంటూ సినీనటుడు ప్రకాష్ రాజ్ విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ షేర్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపైఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ప్రకాష్ రాజ్ నిత్యం ఏదో ఒక వివాదంలో నిలుస్తూ ప్రచారం కోరుకుంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ క్రమంలోనే సర్ ప్రక్రియలో తన ఓటును తొలగించారని సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ పోస్టు పెట్టారని విమర్శించారు."నేను ప్రకాష్ రాజ్‌ను సూటిగా ఓ విషయం అడుగుతున్నా. మీరు సర్ ఫారమ్ నింపాలి, అధికారులు వచ్చినప్పుడు ఇంటి వద్ద ఉండాలి. మీరు బతికి ఉన్నారని నిరూపించుకోవాలి. సోషల్ మీడియాలో, ట్విటర్‌లో బతికి ఉన్నామని నిరూపించుకునే పని అడ్మిన్లు కూడా చేయగలుగుతారు. మీ పేరు శాశ్వతంగా షిఫ్ట్ అయినట్లు మీరు పెట్టిన ఫారంలో ఉంది. అంటే మీరు వేరే ప్రాంతంలో ఉన్నారని.. మీరు వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు మీరు ధ్రువీకరణ ఇవ్వకుండా ఆ విషయం ప్రభుత్వానికి, అధికారులకు ఎలా తెలుస్తుంది? అధికారులు, ఎన్నికల సంఘానికి ధ్రువీకరణ పత్రం అవసరం. ఎందుకంటే మీరు నాలుగు రాష్ట్రాల్లో ఓటు కలిగి ఉన్నారు. మీ మీద కేసు నమోదైంది. బెయిల్ తెచ్చుకున్నారు. ఓటు హక్కును దుర్వినియోగం చేసినట్లు కోర్టులో కేసు ఎదుర్కొంటున్నారు." అని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు."గేమ్ ఆన్ అని ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నావ్.. ఓటు హక్కు లేని నీలాంటివాడితో ఏం గేమ్ ఆడతాం.. ఇది సినిమా షూటింగ్ కాదు. ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించాలి, చట్టబద్ధంగా బతకాలి, చట్టపరిధిలో ఉండాలనే కనీస జ్ఞానం మీకు లేదు. ఒక పౌరుడిగా మీరు భారతదేశంలో ఉన్నట్లు, బతికి ఉన్నట్లు, కర్ణాటకలో ఉన్నట్లు ధ్రువీకరించుకుని ఓటుహక్కును రెన్యువల్ చేసుకోండి. " అని విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు.మరోవైపు ప్రకాష్ రాజ్ ఆరోపణలపై ఎన్నికల సంఘం కూడా స్పందించింది. సర్ ప్రక్రియలో భాగంగా అధికారులు