ఓజి 2’ ట్విస్ట్.. ఇప్పటికీ ప్లాన్ ఆన్ లోనే
Actor ProfileActor

ఓజి 2’ ట్విస్ట్.. ఇప్పటికీ ప్లాన్ ఆన్ లోనే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఓజి 2’ ట్విస్ట్.. ఇప్పటికీ ప్లాన్ ఆన్ లోనే
123Telugu7 Dec 2026
ఓజి 2’ ట్విస్ట్.. ఇప్పటికీ ప్లాన్ ఆన్ లోనే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న క్రేజీ ప్రాజెక్ట్ నే ‘ఓజి 2’. తాను కూడా పర్శనల్ గా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని తన ఫ్యాన్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్నాడు. పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రానున్న ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. కొన్ని నెలల కితం వచ్చిన వరుస అప్డేట్స్ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో హైప్ ఇచ్చాయి. ఇలా సినిమా కూడా అతి త్వరలోనే మొదలైపోతుంది అనే టాక్ కూడా వినిపించింది. కానీ మధ్యలో పవన్ కి ఆరోగ్యం బాగోకపోవడం, సుజీత్, నాని ప్రాజెక్ట్ కూడా మొదలవుతుంది అనే రూమర్స్ మొదలు కావడంతో ఓజి ఆలస్యం అవుతుంది అనే టాక్ వచ్చింది. అయితే లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఓజి 2 ప్లాన్ లలో ఎలాంటి మార్పు లేనట్టు తెలుస్తుంది. సినిమా అనుకున్నట్టుగా షూట్ నవంబర్ నుంచే మొదలయ్యే ఛాన్స్ ఇప్పటికీ ఉందట. పవన్ అందుకు సిద్ధం గానే ఉన్నారని తెలుస్తుంది. సో అన్నీ సెట్ అయితే ఓజి 2 ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకి వెళ్ళిపోనుంది