ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి
Actor ProfileActor

ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి
Sakshi24 Dec 2026
ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి

సొంత ఇల్లు లేదా స్థలానికి సంబంధించిన ఒరిజినల్ సేల్ డీడ్ (రిజిస్ట్రేషన్ కాగితాలు) పొరపాటున పోగొట్టుకోవడం లేదా ప్రమాదవశాత్తు పాడైపోవడం ఆస్తిదారులకు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించే అంశమే. అయితే, ఒరిజినల్ డాక్యుమెంట్లు చేజారినంత మాత్రాన ఆస్తిపై యాజమాన్య హక్కులు కోల్పోతారని భావించడం పూర్తిగా అపోహ మాత్రమే. భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం-1908 ప్రకారం సరైన న్యాయపరమైన ప్రక్రియను పాటించడం ద్వారా మీ హక్కులను సమర్థవంతంగా పరిరక్షించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దస్తావేజులు పోయినట్లు గుర్తించిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నాన్-ట్రేసబుల్ సర్టిఫికేట్ పొందాలి. భవిష్యత్తులో ఈ పత్రాలు దుర్వినియోగం కాకుండా, ఫోర్జరీకి గురికాకుండా ఇది ప్రాథమిక చట్టపరమైన రక్షణగా పనిచేస్తుంది. ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో పాటు స్థానిక ప్రాంతీయ (తెలుగు) దినపత్రికలో ఆస్తి వివరాలు, సర్వే నంబర్లు, పోయిన పత్రాల సమాచారాన్ని పేర్కొంటూ పబ్లిక్ నోటీసు ఇవ్వాలి. 15-21 రోజుల గడువులో ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే ఆ పత్రికా నోటీసు కాపీ స్పష్టమైన ఆధారంగా ఉపయోగపడుతుంది. పత్రాలు పోయిన తీరును వివరిస్తూ నోటరీ సమక్షంలో అఫిడవిట్ రాయించుకోవాలి. భవిష్యత్తులో ఆస్తి అమ్మకం సమయంలో కొనుగోలుదారులు లేదా బ్యాంకుల సందేహాలను నివృత్తి చేయడానికి ఇండెమ్నిటీ బాండ్ ఎంతో దోహదపడుతుంది. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సర్టిఫైడ్ కాపీ రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 57 ప్రకారం ప్రభుత్వ రికార్డులలో ప్రతి ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రతి శాశ్వతంగా భద్రపరుస్తారు. కాబట్టి సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని చట్టబద్ధమైన సర్టిఫైడ్ కాపీ (ధ్రువీకృత నకలు) పొందవచ్చు. ఇది ఒరిజినల్ పత్రంతో సమానమైన న్యాయపరమైన విలువను కలిగి ఉంటుంది. బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే పరిహారం తప్పనిసరి ఒకవేళ హోమ్ లోన్ కోసం బ్యాంకులో కుదువబెట్టిన ఒరిజినల్ పత్రాలను బ్యాంకే పోగొడితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం సదరు బ్యాంకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాధితుడికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు సొంత ఖర్చులతో