ఒడిస్సీ మొద టి రివ్యూలొచ్చాయి.. సినిమా ఎలా ఉందంటే
Actor ProfileCelebrity

ఒడిస్సీ మొద టి రివ్యూలొచ్చాయి.. సినిమా ఎలా ఉందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఒడిస్సీ మొద టి రివ్యూలొచ్చాయి.. సినిమా ఎలా ఉందంటే
Telugu Times8 Oct 2026
ఒడిస్సీ మొద టి రివ్యూలొచ్చాయి.. సినిమా ఎలా ఉందంటే

క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) దర్శకత్వంలో రూపొందిన ది ఒడిస్సీ(The odyssey) ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. జూలై 17న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన వరల్డ్ ప్రీమియర్ తాజాగా ఘనంగా జరిగింది. ప్రధాన తారాగణం, చిత్రబృందం పాల్గొన్న ఈ ప్రీమియ‌ర్ త‌ర్వాత ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ క్రిటిక్స్, ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ జర్నలిస్టులు తమ తొలి అభిప్రాయాలను వెల్లడించారు. సినిమా విజువల్ స్కేల్, భావోద్వేగాల ప్రదర్శన, నోలన్ కథను చెప్పిన తీరు ప్రేక్షకులను థియేటర్లలో కొత్త అనుభూతికి తీసుకెళ్తుందని పలువురు ప్రశంసించారు. ముఖ్యంగా బిగ్ స్క్రీన్ పై తప్పకుండా చూడాల్సిన సినిమా అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ ను వ్యక్తం చేశాయి. విజువల్ ప్రెజెంటేషన్‌తో పాటు నటీనటుల పెర్ఫార్మెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, టెక్నిక‌ల్ వాల్యూస్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయని తొలి రివ్యూలు సూచిస్తున్నాయి. పూర్తి రివ్యూలు ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ, ప్రారంభ అభిప్రాయాలు మాత్రం సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్‌పై సోషల్ మీడియాలో మిక్డ్స్ రియాక్ష‌న్స్ రావడం, క్యాస్టింగ్ ఎంపికలు, విజువల్ టోన్‌పై విమర్శలు వ్యక్తమవడం వల్ల సినిమా రిలీజ్‌కు ముందు కొంత ప్రతికూల చర్చ నెలకొంది. అలాంటి సమయంలో వరల్డ్ ప్రీమియర్ తర్వాత వస్తున్న పాజిటివ్ టాక్ చిత్రబృందానికి భారీ ఊరటనిచ్చే అంశంగా మారింది. రిలీజ్‌కు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ రివ్యూలు ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచే అవకాశముంది. సినిమా ఫైన‌ల్ రిజ‌ల్ట్ మాత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాతే వెలువడనుంది