ఒకవైపు సైనిక విన్యాసాలు.. మరోవైపు కిమ్ తో స్నేహ మంటున్న ట్రంప్ .. కొరియా ద్వీపకల్పంలో అసలేం జ
Actor ProfilePolitician

ఒకవైపు సైనిక విన్యాసాలు.. మరోవైపు కిమ్ తో స్నేహ మంటున్న ట్రంప్ .. కొరియా ద్వీపకల్పంలో అసలేం జ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఒకవైపు సైనిక విన్యాసాలు.. మరోవైపు కిమ్ తో స్నేహ మంటున్న ట్రంప్ .. కొరియా ద్వీపకల్పంలో అసలేం జ
AP7AM28 Dec 2026
ఒకవైపు సైనిక విన్యాసాలు.. మరోవైపు కిమ్ తో స్నేహ మంటున్న ట్రంప్ .. కొరియా ద్వీపకల్పంలో అసలేం జ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మధ్య సంబంధాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో కిమ్‌తో ఉన్న ఒక పాత ఫొటోను పంచుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈ ఫొటోలో మేమిద్దరం సీరియస్‌గా కనబడుతున్నప్పటికీ, మేం నవ్వుతూ దిగిన ఫొటోలు చాలా ఉన్నాయి. కిమ్ జాంగ్ ఉన్, నేను చాలా గొప్పగా కలిసిపోతాం!" అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.అయితే, ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఆయన కిమ్‌తో స్నేహాన్ని గుర్తుచేసుకుంటుండగా, మరోవైపు కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా, దక్షిణ కొరియాలు కలిసి నిర్వహించనున్న సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 'ఉల్చీ ఫ్రీడమ్ షీల్డ్' పేరుతో ఆగస్టు 17 నుంచి 27 వరకు ఈ సైనిక విన్యాసాలు జరగనున్నాయి. డ్రోన్లు, జీపీఎస్ జామింగ్, సైబర్‌టాక్స్‌ను ఎదుర్కోవడం వంటి ఆధునిక యుద్ధ తంత్రాలపై ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు.ఈ విన్యాసాలపై ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. అమెరికా-జపాన్-దక్షిణ కొరియా సైనిక సహకారం ఒక 'అణు కూటమి'గా మారుతోందని ఆరోపించింది. అల్ జజీరా కథనం ప్రకారం.. "కొత్త స్థాయి ముప్పును తాము కొత్త స్థాయి నిరోధక శక్తితో ఎదుర్కొంటామని" ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ ద్వారా హెచ్చరించింది. గత ఐదేళ్లలో జరిగిన విన్యాసాల కంటే ఇవి భిన్నమైనవని, ఆధునిక యుద్ధ నైపుణ్యాలను