ఒకే వేదిక మీదకు వైఎస్సార్ ఫ్యామిలీ
Actor ProfilePolitician

ఒకే వేదిక మీదకు వైఎస్సార్ ఫ్యామిలీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఒకే వేదిక మీదకు వైఎస్సార్ ఫ్యామిలీ
Oneindia Telugu27 Sept 2026
ఒకే వేదిక మీదకు వైఎస్సార్ ఫ్యామిలీ

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ రాజకీయం పతాక స్థాయికి చేరింది. వైసీపీ లక్ష్యంగా కూటమి ముఖ్య నేతలు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. అటు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. 2029 ఎన్నికల కోసం రెండు వైపులా ఇప్పటి నుంచే కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇడుపులపాయ వేదికగా వైఎస్ కుటుంబం మొత్తం ఒకే వేదిక మీదకు రానుంది.వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఒకే వేదిక మీదకు వస్తున్నారు. జగన్ తో సోదరి షర్మిల విభేదించిన తరువాత రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ అయిన సమయం నుంచి జగన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఇద్దరి మధ్య రాజీ కోసం ప్రయత్నాలు జరిగాయనే ప్రచారం జరిగింది. వైఎస్సార్ జన్మదినం.. వర్థంతి రోజున ఇద్దరూ ఇడుపులపాయలోనే ఉంటున్నా.. కలిసి నివాళి అర్పించటం లేదు. వేర్వేరుగానే తమ కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లి విజయమ్మ ఇద్దరితోనూ కలిసి నివాళి అర్పిస్తున్నారు. ఈ ఏడాది సైతం జూలై 8న వైఎస్సార్ జన్మదినం కావటం తో నివాళి అర్పించేందుకు కుటుంబ సభ్యులు ఇడుపుల పాయ చేరుకుంటున్నారు. 8వ తేదీ ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. గోదావరి కేంద్రంగా జగన్ అనూహ్య నిర్ణయం, మారుతున్న లెక్కలు..!!రెండు రోజులు పులివెందులలో జగన్ఇక, మాజీ సీఎం జగన్ రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు.జూలై 7న పులివెందులలో ప్రజాదర్భార్‌ నిర్వహిస్తారు. బాకరాపురం నివాసంలో రాత్రికి బస చేస్తారు. 8వ తేదీ ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్సార్‌ ఘాట్‌ వద్ద నిర్వహించనున్న ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. కాగా.. కుటుంబ సభ్యులు అందరూ ఇడుపులపాయలో బస చేస్తున్న వేళ.. మరోసారి రాజకీయంగా చర్చగా మారుతోంది