ఒంటరిగా చూడాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. 3 ఓటీటీల్లో దుమ్మురేపుతున్న హారర్ థ్రిల్లర్
Actor ProfileActor

ఒంటరిగా చూడాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. 3 ఓటీటీల్లో దుమ్మురేపుతున్న హారర్ థ్రిల్లర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఒంటరిగా చూడాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. 3 ఓటీటీల్లో దుమ్మురేపుతున్న హారర్ థ్రిల్లర్
TV9 Telugu3 Nov 2026
ఒంటరిగా చూడాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. 3 ఓటీటీల్లో దుమ్మురేపుతున్న హారర్ థ్రిల్లర్

హారర్, సైకలాజికల్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ వేదికలలో ఇలాంటి జానర్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ఒక హారర్ థ్రిల్లర్ మూవీ నెట్టింట తెగ వైరలవుతుంది. ఆ సినిమా పేరు త్రికాల. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన ఈ చిత్రం మే 28న థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ లలో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఇప్పుడు ఒకేసారి మూడు ప్లాట్ ఫామ్ లలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. తెలుగు, తమిళం భాషలలోనూ ఈ సినిమా స్ట్రమింగ్ అవుతుంది. ఎక్కువ మంది చదివినవి :Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా.. ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకు మణి తెల్లగూటి దర్శకత్వం వహించగా.. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాధిక శ్రీనివాస్ నిర్మించారు. యానిమల్ సినిమాకు సంగీతం అందించిన హర్షవర్దన్ రామేశ్వర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఇక బీజీఎమ్ మే ఈ సినిమాకు ప్రధాన బలం అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా మూడు ఓటీటీలలో దూసుకుపోతుంది. ఇందులో హీరోయిన్ శ్రద్ధా దాస్, సీనియర్ నటి ఆమని, ప్రభాకర్, రవి వర్మ, సాహితి, నటుడు అజయ్ కీలకపాత్రలు పోషించారు. ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా.. కథ విషయానికి వస్తే.. రాజ వంశీకుల కుటుంబాన్ని తరతరాలుగా వెంటాడే ఒక భయంకరమైన శాపం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఆ వంశంలో పుట్టిన వైతరణ్ (అజయ్) పుట్టుకతోనే సూర్యరశ్మిని చూడలేని వింత