
Rating: 2.75/5 ---సూర్య ప్రకాష్ జోశ్యుల 1980-90ల నేపథ్యంలో సముద్ర తీరంలోని పోర్ట్ ఏరియాలో సాగే కథ ఇది. బతుకుదెరువు కోసం భార్య, కూతురుతో కలిసి ఇసకపట్నం పోర్ట్ ప్రాంతానికి వలస వస్తాడు నాయుడు (సముద్రఖని). సాధారణ కూలీగా జీవితం ప్రారంభించిన అతనిలో అధికార కాంక్ష,క్రూరత్వం అధికం. తన ఎదుగుదల కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం. దాంతో ఆ ప్రాంతానికి వచ్చిన కొద్ది కాలానికే లోకల్ మత్స్యకారుల నాయుకుడు చిన్నారావు (రాజీవ్ కనకాల)ని హత్య చేసి పోర్ట్ ఏరియాను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటాడు. స్మగ్లింగ్, అక్రమ వ్యాపారాలు, రౌడీయిజంతో ఎదురులేని శక్తిగా ఎదుగుతాడు. ఇక నాయుడుకో కూతురు భారతి (ఐశ్వర్య రాజేష్). తండ్రికి రివర్స్ ఆమె. చాలా మంచి అమ్మాయి. హింసకు దూరంగా ఒక ఎన్జీవో ద్వారా పేదలకు సాయం చేస్తూంటుంది. కారు డ్రైవర్ సూరి (సుదాకర్ కోమాకుల)ని ప్రేమిస్తూంటుంది. అయితే తండ్రి తన రాజకీయ సమస్యలు తొలిగించుకోవటానికి ప్రతాప్ వర్మ ( రవి వర్మ) కి తనను ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడని తెలుసుకుంటుంది. అప్పుడు భారతి ఏం చేసింది. తండ్రి కు వ్యతిరేకంగా ఎలాంటి గేమ్ ఆడింది...నాయుడు అప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యాడు. ఈ కథలో 'పోతన' (జ్వాలా కోటి) పాత్ర ఏమిటి.. పోలీసు అధికారి వర్మ (సునీల్), పెద్దన్న (నరేష్ అగస్త్య) పాత్రలు ఏమిటి? ఈ కథలో అసలు హీరో ఎవరు...చివరకు ఈ కథ ఎలా ముగిసింది అనేది తెలియాలంటే 'ఇసకపట్నం' వెబ్ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: నిజానికి ఈ కథలో హీరో భారతి. అయితే అది మనకు చివరి దాకా తెలియదు. భారతి...దర్శకుడు దాచిన ట్రంప్ కార్డ్ అని అర్దమయ్యే సరికే సీరిస్ పూర్తవుతుంది. ఇది ఎందుకు జరిగింది? ఇసకపట్నంలో మొదటి నుంచి మనం ఎక్కువగా నాయుడు ప్రపంచాన్నే చూస్తాం. అతని ఎదుగుదల, అతని సామ్రాజ్యం, అతని నిర్ణయాలు... అన్నీ అతని కోణంలోనే జరుగుతాయి. భారతి మాత్రం ఎక్కువసేపు