ఐరన్ మ్యాన్ ఇప్పుడు భయంకరమైన విలన్.. యాక్ష న్ ప్యాక్ డ్ అవెంజర్స్
Actor ProfileActor

ఐరన్ మ్యాన్ ఇప్పుడు భయంకరమైన విలన్.. యాక్ష న్ ప్యాక్ డ్ అవెంజర్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఐరన్ మ్యాన్ ఇప్పుడు భయంకరమైన విలన్.. యాక్ష న్ ప్యాక్ డ్ అవెంజర్స్
AP7AM23 Dec 2026
ఐరన్ మ్యాన్ ఇప్పుడు భయంకరమైన విలన్.. యాక్ష న్ ప్యాక్ డ్ అవెంజర్స్

ప్రపంచవ్యాప్తంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమా నుంచి రెండో ట్రైలర్ విడుదలైంది. డిస్నీ డీ23 ఈవెంట్‌లో విడుదల చేసిన ఈ ట్రైలర్, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా ఒకప్పుడు ఐరన్ మ్యాన్‌గా ప్రపంచాన్ని కాపాడిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఈసారి భయంకరమైన విలన్ ‘డాక్టర్ డూమ్’ పాత్రలో కనిపించడం ఈ ట్రైలర్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డూమ్ పాత్ర ఎంత శక్తిమంతమైనదో, అతని గతం ఎంత భావోద్వేగభరితమైనదో ఈ ట్రైలర్ స్పష్టంగా చూపించింది.రెండు నిమిషాల పది సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్, విక్టర్ వాన్ డూమ్ (డాక్టర్ డూమ్) గతాన్ని, ఫెంటాస్టిక్ ఫోర్‌తో అతనికి ఉన్న సంబంధాన్ని పరిచయం చేసింది. ముఖ్యంగా ఫెంటాస్టిక్ ఫోర్‌లోని సూ స్టార్మ్ (వనెస్సా కిర్బీ), మిగతా హీరోలకు డూమ్ గురించి వివరిస్తున్న డైలాగ్స్ అతని పాత్రకు లోతును అద్దాయి. "విక్టర్ ఒకప్పుడు చాలా తెలివైనవాడు, దయగలవాడు. కానీ, తను ప్రేమించిన వాళ్లందరినీ కోల్పోయాడు. అతను దారి తప్పాడని నాకు తెలుసు, కానీ ఇంతగా విరిగిపోయాడని నేను గ్రహించలేదు" అని ఆమె చెప్పే మాటలు డూమ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు కారణాలను సూచిస్తున్నాయి.ట్రైలర్‌లో డూమ్‌ను ఎదుర్కొన్న రీడ్ రిచర్డ్స్ (పెడ్రో పాస్కల్), "ఇదంతా నువ్వే చేశావా?" అని ప్రశ్నించగా.. "మీరంతా దొంగిలించబడిన జీవితాలను గడిపారు. ఇప్పుడు వాటిని తిరిగి ఇవ్వాలి" అని డూమ్ చెప్పిన డైలాగ్ సినిమా కథపై క్యూరియాసిటీని పెంచుతోంది. తన భార్య, కొడుకు ఉన్న ఒక చిత్రాన్ని డూమ్ చూస్తున్న దృశ్యం