ఐదు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్
Actor ProfilePolitician

ఐదు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఐదు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్
Andhra Jyothy27 Oct 2026
ఐదు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్

ఏడు విభాగాల్లో 50 అం శాల్లో అత్యుత్తమంగా నిలవడంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సింగరేణికి చెందిన ఐదు గనులకు జాతీయస్థాయిలో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ లభించింది. శ్రీరాంపూర్‌(మంచిర్యాల): ఏడు విభాగాల్లో 50 అం శాల్లో అత్యుత్తమంగా నిలవడంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సింగరేణికి చెందిన ఐదు గనులకు జాతీయస్థాయిలో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ లభించింది. ఇందులో శ్రీరాంపూర్‌ ఏరియాకు చెందిన రెండు గనులున్నాయి. కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ అయిన కోల్‌ కంట్రోలర్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా ఏటా పోటీలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 382 గనులు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, బొగ్గు గనుల్లో పనివిధానం, కార్మిక సంక్షేమం, పర్యావరణ రక్షణ చర్యలు, సమీప గ్రామాల అభివృద్ధి వంటి అంశాలను ఏడు విభాగాలుగా ఏర్పాటు చేసి 50 అంశాలను పరిశీలించారు. అన్నింటిలోనూ మేటిగా కనిపించడంతో 5 స్టార్‌ రేటింగ్‌ను ప్రకటించారు. అలాగే సింగరేణికే చెందిన మరో 17 గనులు 4 స్టార్‌ రేటింగ్‌ సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు. సింగరేణి గనులు 5 రేటింగ్‌ స్టార్‌ రేటింగ్‌ సాధించడంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన పనితీరుతో ప్రతిభ చూపాలని ఆదేశించారు. రేవంత్ రెడ్డి ఆట మొదలు పెట్టాడు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు