TCS Headcount Increase : భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రూటు మార్చేసింది. ఒకవైపు అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ వృద్ధిని కొనసాగిస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ మంచి లాభాల్ని గడించింది. 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్- జూన్) నికర లాభం అంతకుముందు ఇదే సమయంతో పోలిస్తే సుమారు 5 శాతం వరకు పెరిగి రూ. 13349 కోట్లుగా వచ్చింది. ఆదాయం 14 శాతం మేర పుంజుకోగా ఇప్పుడు రూ. 72,275 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కూడా టీసీఎస్ ప్రకటించింది. ఇదిలా ఉండగా గత కొన్ని త్రైమాసికాల్లో టీసీఎస్ సహా ఇతర దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఏఐ ఎంట్రీతో ఈ సంప్రదాయ ఐటీ సర్వీసులకు డిమాండ్ తగ్గుతుందన్న భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఆయా కంపెనీలు ఉద్యోగుల్ని తగ్గిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు అనిశ్చితిలోనూ టీసీఎస్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా సరికొత్త ఏఐ స్కిల్స్ కలిగిన అభ్యర్థుల్ని భారీగా చేర్చుకుంటోంది. కిందటి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఒక్క క్వార్టర్‌లోనే నికరంగా టీసీఎస్‌లో 9279 మంది ఉద్యోగులు పెరిగారు. సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 593798 కి చేరింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో హెడ్‌కౌండ్ రికార్డు స్థాయిలో 613069 గా ఉండేది. క్యూ3 కి వచ్చే సరికి ఈ సంఖ్య 5,82,163 కు పడిపోయింది. ఇప్పుడు మళ్లీ సంఖ్య పెరుగుతోంది. ఏఐ టాలెంట్‌ను పెంచే లక్ష్యంతో ఇదే సమయంలో దేశవ్యాప్తంగా క్యాంపస్ రిక్రూట్మెంట్లు (ప్రాంగణ నియామకాలు) కూడా నిర్వహిస్తోంది. ఇలా సమీక్షా త్రైమాసికంలో ఏకంగా 14 వేల మందికిపైగా ఫ్రెషర్లను చేర్చుకోవడం విశేషం.Read Also: 2026లోనూ
Actor ProfilePolitician
ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•19 Oct 2026
ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- వేలల్లో కొత్త నియామకాలు- ఏఐతో మరింత పెరిగిన డిమాండ్