ఐటీఆర్ ఫైల్ చేశారా? ఈ తప్పులు చేస్తే డిఫెక్టివ్ నోటీసులు వస్తాయ్.. వెంటనే ఇలా చేయండి
Actor ProfilePolitician

ఐటీఆర్ ఫైల్ చేశారా? ఈ తప్పులు చేస్తే డిఫెక్టివ్ నోటీసులు వస్తాయ్.. వెంటనే ఇలా చేయండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఐటీఆర్ ఫైల్ చేశారా? ఈ తప్పులు చేస్తే డిఫెక్టివ్ నోటీసులు వస్తాయ్.. వెంటనే ఇలా చేయండి
Samayam Telugu7 Jan 2027
ఐటీఆర్ ఫైల్ చేశారా? ఈ తప్పులు చేస్తే డిఫెక్టివ్ నోటీసులు వస్తాయ్.. వెంటనే ఇలా చేయండి

Defective Notice ITR: 2025-26 ఆర్థిక సంవత్సరం లేదా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫైల్ చేసిన టాక్స్ పేయర్స్ తమ రిజిస్టర్డ్ మెయిల్, ఇన్‌కంటాక్స్ ఇ- ఫైలింగ్ పోర్టల్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. రిటర్న్స్‌లో సరైన వివరాలు లేకపోయినా, ఇంకా మీరు ఇచ్చిన సమాచారం అసంపూర్తిగా ఉన్నా ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి సెక్షన్ 139(9) కింద డిఫెక్టివ్ ఐటీఆర్ నోటీసులు రావొచ్చు. అయితే ఈ నోటీసులు వచ్చినప్పుడు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా, దాంట్లో పేర్కొన్న లోపాన్ని గుర్తించి నిర్ణీత సమయంలోగా సరిచేయడం ముఖ్యం.ఐటీఆర్‌లో అవసరమైన సమాచారం పూర్తిగా ఇవ్వకపోయినా, ఇచ్చిన వివరాల మధ్య తేడాలు ఉన్నా లేదా ఐటీ రిటర్న్స్ ఫారాలకు సంబంధించిన నిబంధనల్ని సరిగ్గా పాటించకపోయినా దాన్ని డిఫెక్టివ్ రిటర్న్‌‌గా పరిగణించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక టాక్స్ పేయర్ టీడీఎస్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసి, దానికి సంబంధించిన ఆదాయాన్ని ఐటీఆర్‌లో చూపించకపోతే సమస్య రావొచ్చు. అలాగే బిజినెస్ లేదా ప్రొఫెషన్ ద్వారా ఆదాయం ఉన్న అవసరమైన ఆర్థిక వివరాల్ని పూర్తిగా ఇవ్వకపోయినా నోటీసులు వస్తాయి.ఇన్‌కంటాక్స్ విభాగం ప్రధానంగా 3 మార్గాల్లో డిఫెక్టివ్ రిటర్న్ గురించి సమాచారం ఇవ్వొచ్చు. ముందుగా రిజిస్టర్డ్ ఇ- మెయిల్‌కు నోటీసు పంపుతుంది. ఎక్కువ శాతం ఇదే చేస్తుంది. లేదా పోస్ట్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. లేదా ఇ- ఫైలింగ్ పోర్టల్‌లో నోటీసును అందుబాటులో ఉంచొచ్చు. అందుకే వీటిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఆ నోటీసులో సాధారణంగా ఐటీఆర్‌లో ఏ లోపం ఉంది? దాన్ని ఎలా సరిచేయాలో వివరాలు ఉంటాయి.Read Also: అసలు యూపీఐ లావాదేవీలు ఉచితమా.. ఛార్జీలు పడతాయా? ఆర్థిక మంత్రి నిర్మలమ్మ కీలక ప్రకటన15 రోజుల్లోగా స్పందించాలిసెక్షన్ 139(9) కింద డిఫెక్టివ్ ఐటీఆర్ నోటీసులు అందుకున్నప్పుడు సాధారణంగా నోటీసు అందుకున్న తేదీ నుంచి 15 రోజుల్లో అందులో ఉన్న లోపాన్ని లేదా తప్పుల్ని సరిచేసి పంపించాల్సి ఉంటుంది. నోటీసులో ప్రత్యేకంగా