
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. 116 Old Years Devotee In Tirumala: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన ఏడుకొండలను ఎక్కడం అంటే ఆ శ్రీవారి కరుణాకటక్షం ఉంటేనే సాధ్యం. యుక్త వయస్సు వారే అలసి సొలసి తిరుమల మెట్లు ఎక్కుతుంటారు. అలాంటి వందేళ్లు పైబడిన ఓ భక్తురాలు తిరుమల మెట్లు ఎక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె అచంచల భక్తి, దేవుడిపై ఉన్న నమ్మకంతోనే 116 ఏళ్ల బామ్మ తిరుమల మెట్లు ఎక్కారని అందరూ పేర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ పెద్దావిడను రేపు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. ఓ కుటుంబంతో కలిసి ఓ వృద్ధురాలు అలిపిరి మెట్లు ఎక్కుతూ కనిపించింది. తిరుమల శ్రీవారిపై అంచంచల భక్తి విశ్వాసాలతో శక్తిన్నంతా పెట్టి మెట్లు ఎక్కుతూ ఆమె వచ్చింది. తిరుమల మెట్లు శతాధిక వృద్ధురాలు ఎక్కడంతో భక్తులంతా నివ్వెరపోయారు. మలి వయసులోనూ ఆమె తిరుమల మెట్లెక్కడాన్ని ఆశ్చర్యంగా చూశారు. ఒంట్లో శక్తి లేకపోయినా ఒక్కో మెట్టు ఒక్కో నిమిషం చేస్తూ ఆ పెద్దావిడ విజయవంతంగా మెట్లు ఎక్కారు. శతాధిక వృద్దురాలు శ్రీవారి దర్శనం కోసం మెట్లెక్కిన దృశ్యాలు వైరలయ్యాయి. 116 ఏళ్ల వృద్ధురాలు ఆచూకీ కనుక్కోగా.. తమిళనాడుకు చెందిన నవనీతమ్మ అని తేలింది. తమిళనాడుకు చెందిన నవనీతమ్మ ప్రస్తుతం తిరుపతి జీవకోనలో బంధువుల వద్ద నివసిస్తున్నారు. కాలినడకన తిరుమలకు వచ్చిన వృద్ధురాలు వివరాలు తెలుసుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ ఓ ప్రకటన చేశారు. వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబసభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. తిరుమల వేంకటేశ్వర స్వామి