
ఆగస్టు 18, 2008.. శ్రీలంకతో మ్యాచ్‌లో ఒక 19 ఏళ్ల కుర్రాడు 18వ నెంబర్ జెర్సీ మైదానంలో బరిలోకి దిగాడు. నునుగు మీసాలతో ఉన్న ఆ కుర్రాడు మ్యాచ్‌లో 22 బంతులాడి 12 పరుగులే చేసి ఔటయ్యాడు. అయితే ఆ కుర్రాడే భారత క్రికెట్‌ను ఏలబోతున్నాడన్న విషయం అతడితో సహా అక్కడున్న వారికి ఎవరికీ తెలియదు. కట్‌చేస్తే 18 ఏళ్లు తిరిగేసరికి అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20లు) కలిపి 28,359 పరుగులు చేసి ఆల్‌టైమ్ అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 85 సెంచరీలు, 125 హాఫ్ సెంచరీలున్నాయి. వన్డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టిన ఆ వ్యక్తి ఎవరో కాదు.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. 18 ఏళ్ల ప్రయాణంలో కోహ్లి ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం మొదలై ఇవాళ్టితో (ఆగస్టు 18) 18 సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కోహ్లి లక్కీ నంబర్ 18 అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతడు వేసుకునే జెర్సీ నెంబర్ 18.. ఐపీఎల్‌లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ సాధించింది 18వ ఎడిషన్‌లోనే కావడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే కోహ్లికి 18వ సంఖ్య అంటే బాగా ఇష్టం. ఈ నేపథ్యంలో కోహ్లి 18 ఏళ్ల ప్రయాణంలో 18 అద్భుత క్షణాలను ఒకసారి గుర్తుకుతెచ్చుకుందాం. 1) తండ్రి మరణం 2006 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో, 18 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లి అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడు. డిసెంబర్ 19న 40 పరుగులతో ఆడుతున్న సమయంలో తన తండ్రి మరణవార్త తెలిసినప్పటికీ కోహ్లి ఆ వార్తను దిగమింగి 90 పరుగులతో ఢిల్లీ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. 2) అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ మలేషియాలోని కౌలాలంపూర్‌లోని వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన