ఏళ్ల ప్రయాణం.. ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ
Actor ProfileActor

ఏళ్ల ప్రయాణం.. ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏళ్ల ప్రయాణం.. ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ
Sakshi7 Oct 2026
ఏళ్ల ప్రయాణం.. ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ

కోలీవుడ్‌ లో ఇంతకు ముందు పలువురు నటీమణులు అక్కగా, అమ్మగా, అత్తగా నటించి ఆయా పాత్రలకు జీవం పోశారు. అలాంటి పాత్రలకు ఇప్పుడు ప్రాణం పోస్తున్న నటీమణుల్లో నటి లిజీ ఆంటోని ఒకరు. పలు చిత్రాల్లో రకరకాల పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్న ఈ ప్రోఢ సినీ పయనం సాధారణం కాదు. 16 ఏళ్లుగా నచ్చిన, వచ్చిన పాత్రలను చేసుకుంటూ తనకుటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. తాజాగా విష్ణు విశాల్‌ హీరోగా నటించిన కట్టా కుస్తీ 2 చిత్రంలో నటుడు కరణాస్‌ కు జంటగా ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ఈమె నటనకు సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఈ సందర్భంగా నటి లిజీ ఆంటోని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కట్టా కుస్తీ 2 చిత్ర దర్శకుడు అయ్యా సెల్లవు కు ధన్యవాదాలు తెలిపారు. తనకు ఆయన కట్టా కుస్తి చిత్రంలోని అవకాశం కల్పించారని పేర్కొన్నారు. 16 ఏళ్ల క్రితం కమలహాసన్‌ కథానాయకుడిగా నటించిన తూంగావనం చిత్రంతో తన నట ప్రయాణం ప్రారంభమైందని అప్పటినుంచి నటిస్తున్నానని చెప్పారు. తరమణి, సాని కాగితం వంటి చిత్రాల్లో తన నటునకు మంచి పేరు, గుర్తింపు లభించిందన్నారు. తన పదహారేళ్ల నట జీవితంలో ఎప్పుడు అలసట అనేది ఎరుగనని, ఎప్పుడైనా అవమానాలు ఎదురైతే వాటిని అధిగమించి ముందుకు సాగుతాయని చెప్పారు అయితే నటిగా ఎలాంటి పాత్రనైనా చేయడానికి తాను వెనుకాడనని పేర్కొన్నారు. కథలో ప్రధానపాత్రను పోషించడానికి అయినా తాను సిద్ధమని, అదే సమయంలో కామెడీ పాత్రల్లోనూ నటిస్తానని అంటున్న లిజీ ఆంటోని ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. గద్వాల్ చీరలో అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు) భార్యతో కలిసి హీరో నాగశౌర్య జపాన్ టూర్ (ఫొటోలు) సందడిగా నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా పెళ్లి(ఫొటోలు) Watch Live: జన హృదయ నేతకు వైఎస్ జగన్ నివాళులు నా అనుభవంతో చెప్తున్నా.. ఎవ్వరు తప్పించుకోలేరు