
దేశంలో కఠిన చట్టాల కింద నమోదైన కేసుల్లో ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గిపోతున్న విచారణ ఖైదీల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA), మనీలాండరింగ్ (PMLA), డ్రగ్స్ నిరోధక చట్టం (NDPS) వంటి కఠినమైన చట్టాల కింద నమోదయ్యే కేసుల విచారణను వేగవంతం చేయడం ఒక్కటే దీనికి ఏకైక మార్గమని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.బెయిల్ రాక, విచారణ పూర్తికాక ఏళ్ల తరబడి నిందితులు జైళ్లలోనే ఉండటంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను ఆయన ప్రస్తావించారు. సుమారు 15 నెలల తన పదవీకాలంలో సగానికి చేరుకున్న సందర్భంగా ఒక ప్రముఖ జాతీయ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీజేఐ పలు కీలక విషయాలను పంచుకున్నారు.ఏడాదిలోనే విచారణ పూర్తి.. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు!ఢిల్లీ అల్లర్ల కేసులు, ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ వంటి వారు ఎదుర్కొంటున్న UAPA కేసుల విచారణలో జరుగుతున్న ఆలస్యంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీజేఐ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిర్దిష్ట కేసులపై నేరుగా స్పందించనప్పటికీ.. ఈ సమస్యను అధిగమించడానికి న్యాయవ్యవస్థ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని ఆయన తెలిపారు. UAPA, PMLA, NDPS కేసుల కోసం ప్రత్యేకంగా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు చెప్పారు. మగాళ్లకు షాక్: అక్రమ సంబంధాలపై సుప్రీం సంచలన తీర్పు ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, కోర్టుల ఏర్పాటు ప్రక్రియ కూడా మొదలైందని తెలిపారు. ఈ ప్రత్యేక కోర్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి, ఏడాది కాల పరిమితిలోగా విచారణలు పూర్తి చేయడం ప్రారంభిస్తే.. విచారణ ఖైదీల సుదీర్ఘ బంధీలపై సాగుతున్న వివాదానికి తెరపడుతుందని సీజేఐ ఆశాభావం వ్యక్తం చేశారు.5 కోట్లు దాటిన కేసులు.. సామాన్యుడికి సుప్రీంకోర్టు దూరం కాకూడదు!ప్రస్తుతం న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు.. గుట్టలుగా పేరుకుపోతున్న కేసుల పెండింగేనని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ట్రయల్