
జానపద గీతాలకు క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.. అంతబాగుంటాయి ఆ పాటలు. మనం రోజువారీ మాట్లాడుకునే మాటలతో పాటలను అల్లి మధురంగా పాడి ప్రేక్షకులను అలరిస్తున్నారు ఎంతో మంది ఫోక్ సింగర్స్. ఇటీవల కాలంలో ఫోక్ సాంగ్స్ హవా పెరిగిపోయింది. ఇటీవల విడుదలైన ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ కు మించి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని ఫోక్ సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై మెప్పిస్తున్నాయి. ఎన్నో సాంగ్స్ ఇప్పుడు మిలియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటూ మెప్పిస్తున్నాయి. దాంతో నెలకు పది సాంగ్స్ విడుదల అవుతున్నాయి. విడుదలైన అన్ని సాంగ్స్ హిట్ అవుతున్నాయి. ఇది కూడా చదవండి : ఏంటి అమ్మడు ఇది నువ్వేనా.!! ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ ఇక ఇప్పుడు ఓ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. యూట్యూబ్ ను ఊపేస్తోంది. ఈ సాంగ్ వింటే తెలియకుండానే మనకు కూడా ఊపొస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పులేయాల్సిందే. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఆ సాంగ్ మరేదో కాదు ఈశా నాగుల కట్ట మీద అంటూ సాగే జానపద గీతం. తెలంగాణ యాసలో సాగే ఈ సాంగ్ భలే ఉంటుంది. ఈ సాంగ్ లో వచ్చే బీట్ మనకు మంచి ఊపునిస్తుంది. ఇది కూడా చదవండి : బిగ్ బాస్ వల్ల చాలా కోల్పోయా.. ఉన్న ఫేమ్ మొత్తం పోయింది.. షాకింగ్ విషయం చెప్పిన నటి ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సాంగ్ లో లిరిక్స్ కూడా భలే ఉంటాయి. జంగి రెడ్డి ఈ సాంగ్ ను రచించారు. అలాగే ఈ సాంగ్ కు ఆర్షిద్ లక్ష్మణ్ సంగీతం అందించారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది