ఏపీలో సినిమా షూటింగ్స్ కు ఉచిత అనుమతులు.. మంత్రి కందుల దుర్గేశ్
Actor ProfilePolitician

ఏపీలో సినిమా షూటింగ్స్ కు ఉచిత అనుమతులు.. మంత్రి కందుల దుర్గేశ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో సినిమా షూటింగ్స్ కు ఉచిత అనుమతులు.. మంత్రి కందుల దుర్గేశ్
AP7AM12 Jan 2027
ఏపీలో సినిమా షూటింగ్స్ కు ఉచిత అనుమతులు.. మంత్రి కందుల దుర్గేశ్

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు ఉచితంగా, సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన 'వెండితెర – ఓటీటీ అవార్డ్స్ 2025-26' కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో 'విబి ఎంటర్‌టైన్‌మెంట్స్' సంస్థ 'సేవ్ ఆర్టిస్ట్ – సేవ్ టాలెంట్' నినాదంతో ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించింది. ఈ వేడుకకు హాజరైన మంత్రి దుర్గేశ్, అవార్డు విజేతలకు పురస్కారాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఏపీలో సినీ పరిశ్రమ విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. డబ్బింగ్, రీ-రికార్డింగ్ థియేటర్ల వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.హైదరాబాద్ తరహాలోనే విజయవాడను కూడా సినీ, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. రాష్ట్రంలోని సహజ సిద్ధమైన లొకేషన్లను చిత్ర పరిశ్రమ మరింతగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.ఇదే కార్యక్రమంలో 'ఉత్తరం' చిత్రంలోని గీతాన్ని ఆవిష్కరించిన మంత్రి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిభావంతులైన కళాకారులను, సాంకేతిక నిపుణులను గుర్తించి సత్కరించడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులను ప్రశంసించారు