
ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్, డిస్‌ప్లే తయారీ రంగంలో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్, సియోల్‌లో ప్రముఖ సెమీకండక్టర్ మెటీరియల్ తయారీ సంస్థ సాఫ్ట్-ఈపీఐ (Soft-Epi) ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన సంస్థను ఆహ్వానించారు.సాఫ్ట్-ఈపీఐ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సుంగ్ చోలతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే తయారీ పరిశ్రమకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. భారత్‌లోని ఇతర కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని, డిస్‌ప్లే తయారీదారుల కోసం ఏపీలో ఒక ప్రత్యేక మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే మెటీరియల్ హబ్‌ను స్థాపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని లోకేశ్ పేర్కొన్నారు.అంతేగాక రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూ మంత్రి లోకేశ్ మరో కీలక ప్రతిపాదనను వారి ముందుంచారు. తిరుపతి ఐఐటీ సహకారంతో రాష్ట్రంలో ఒక అడ్వాన్స్‌డ్ ఎపిటాక్సీ సెంటర్‌ను నెలకొల్పాలని సూచించారు. దీంతో పాటు ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో 'సాఫ్ట్-ఈపీఐ అకాడమీ'ని ఏర్పాటు చేసి GaN ఎపిటాక్సీ, ఎంఓసీవీడీ, మైక్రో ఎల్ఈడీ వంటి అత్యాధునిక సాంకేతికతలపై ఏటా 500 మంది స్థానిక టెక్నీషియన్లకు శిక్షణ ఇవ్వాలని కోరారు.మంత్రి లోకేశ్ ప్రతిపాదనలపై