ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్ ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయండి
Actor ProfilePolitician

ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్ ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్ ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయండి
Telugu Times25 Sept 2026
ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్ ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయండి

సాఫ్ట్-ఈపీఐ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ సియోల్ (సౌత్ కొరియా): దక్షిణ కొరియాకు చెందిన GaN ఎపిటాక్సీ, మైక్రో ఎల్ఈడీ, పవర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ తయారీ సంస్థ సాఫ్ట్-ఈపీఐ (Soft-Epi) కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్ (Mr. Sung Min, Hwang), సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సుంగ్ చో (Mr. In-sung, Cho)లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... భారత్ లోని కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని..డిస్‌ప్లే తయారీదారుల కోసం ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే-మెటీరియల్ హబ్ ఏర్పాటుచేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తిరుపతి ఐఐటీ సహకారంతో ఒక అడ్వాన్స్‌డ్ ఎపిటాక్సీ సెంటర్, GaN ఎపిటాక్సీ, MOCVD, మైక్రో ఎల్ఈడీలలో ఏటా 500 మంది టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చే సాఫ్ట్-ఈపీఐ అకాడమీని ఏపీ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటుచేయాలని కోరారు. సాఫ్ట్-ఈపీఐ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్ మాట్లాడుతూ... తమ సంస్థ దక్షిణ కొరియాలో GaN ఎపివేఫర్లు (epiwafers), మైక్రో-LED ఉత్పత్తులను తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుందని చెప్పారు. భారత్ లో ప్రస్తుతానికి ప్రత్యక్ష తయారీ, కార్యకలాపాలు లేవని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు