ఏపీలో పెట్టుబడులకు బూ యంగ్ గ్రూప్ ఆసక్తి.. సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ భేటీ
Actor ProfilePolitician

ఏపీలో పెట్టుబడులకు బూ యంగ్ గ్రూప్ ఆసక్తి.. సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ భేటీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో పెట్టుబడులకు బూ యంగ్ గ్రూప్ ఆసక్తి.. సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ భేటీ
Eenadu9 Oct 2026
ఏపీలో పెట్టుబడులకు బూ యంగ్ గ్రూప్ ఆసక్తి.. సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ భేటీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏపీ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) దక్షిణకొరియా పర్యటన నాలుగో రోజు కొనసాగుతోంది. పాదరక్షలు, షూ లేసులు, మెటల్ హార్డ్‌వేర్, అనుబంధ పరికరాల తయారీలో పేరెన్నికగన్న బూ యంగ్ గ్రూప్ (Boo Young Group) సీఈవో, ప్రెసిడెంట్ డైరెక్టర్ ర్యాన్ కాంగ్ (Mr. Ryan Kang), బిజినెస్ స్ట్రాటజీ, ప్లానింగ్ మేనేజర్ మిల్లీ రిచర్డ్‌సన్‌లతో మంత్రి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో బూ యంగ్ గ్రూప్ పాదరక్షలు, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటుచేయాలని లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. బూ యంగ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌కి వస్తే సింగిల్ విండో విధానంలో అనుమతులతో పాటు రాష్ట్రంలో ప్రధాన పారిశ్రామిక జోన్లలో కంపెనీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కనెక్టివిటీ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఏపీలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అమలు చేస్తున్నామన్నారు. ఏపీలో బూ యంగ్ పాదరక్షల తయారీ, విడిభాగాల యూనిట్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తూ, రెడీ బిల్ట్ షెడ్ల కోసం అన్వేషిస్తున్నట్లు బూ యంగ్ గ్రూప్ సీఈవో ర్యాన్ కాంగ్ చెప్పారు. తమకున్న గ్లోబల్ నెట్ వర్క్ భారతీయ తయారీ రంగాన్ని ప్రపంచ పంపిణీ వ్యవస్థతో అనుసంధానిస్తుందని పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు