ఏపీలోని ఆ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక.. గంటకు 50 కిమీ వేగంతో గాలులు
Actor ProfilePolitician

ఏపీలోని ఆ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక.. గంటకు 50 కిమీ వేగంతో గాలులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలోని ఆ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక.. గంటకు 50 కిమీ వేగంతో గాలులు, జాగ్రత్త
Zee Telugu25 Jan 2027
ఏపీలోని ఆ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక.. గంటకు 50 కిమీ వేగంతో గాలులు, జాగ్రత్త

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. AP Weather Alert: కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలవరం, ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన కోస్తా జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలే కురుస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది ఏపీలో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణం ఇలా ఉందని నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించినప్పటికీ, వర్షాలు అక్కడక్కడే కురుస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల పగటిపూట కూడా ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా జూన్ మాసంలో నైరుతి రుతుపవనాలు విస్తరించి రాష్ట్రమంతా వర్షాలు కురుస్తాయి.. కానీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల సరిపడా వర్షాలు పడటం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావాలు ఉన్నప్పటికీ, తగినంత వర్షపాతం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ రైతులకు ఏ పంటలు సాగు చేయాలనే దానిపై అవగాహన కల్పిస్తూ ముందస్తు సూచనలు ఇస్తోంది. నేడు కూడా పోలవరం, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న