ఏపీలో కూటమి వెంటనే ఈ తప్పులు సరిదిద్దుకోవాలి.. లేకపోతే వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పవు
Actor ProfilePolitician

ఏపీలో కూటమి వెంటనే ఈ తప్పులు సరిదిద్దుకోవాలి.. లేకపోతే వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పవు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో కూటమి వెంటనే ఈ తప్పులు సరిదిద్దుకోవాలి.. లేకపోతే వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పవు
Samayam Telugu2 Oct 2026
ఏపీలో కూటమి వెంటనే ఈ తప్పులు సరిదిద్దుకోవాలి.. లేకపోతే వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పవు

ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల కూటమి ప్రభుత్వ "అద్భుత" పాలనకు ఇవే నిలువెత్తు నిదర్శనాలా? అంటూ జనసేన నేత, పర్యావరణ వేత్త బొలిశెట్టి సత్యనారాయణ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకురావడానికి ప్రత్యేకంగా నలుగురు స్పెషల్ రిప్రజెంటేటివ్‌లను నియమిస్తూ జారీ చేసిన జీవో గురించి ప్రస్తావించారు. అందరూ కలిసి ఏరి, కోరి తెచ్చుకున్న కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయం, సామాజిక అభివృద్ధి కోసం ఎంతగా తపిస్తోందో అర్థమవుతోంద్నారు. ఇదేనా కూటమి కులాలను కలిపే ఆలోచనా విధానం? అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా, వారికే మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే.. ఇదేనా అవినీతిపై_రాజీలేని_పోరాటం? అంటూ ఘాటుగా స్పందించారు. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' పేరుతో కనీస EIA (పర్యావరణ ప్రభావ అంచనా), మిగిలిన అంచనాలు కూడా లేకుండానే ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న మెగా డేటా సెంటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేనా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అంటూ ప్రశ్నించారు. కూటమి రెండేళ్ల పాలన పూర్తి చేసుకుందంటూ భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారని.. కానీ ఆ హోర్డింగ్‌లలో కూటమి ఎక్కడ? కూటమి పార్టీల అధినేతలు ఎక్కడ? కనీసం ఉమ్మడి లోగో కూడా కనిపించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా "ఏరు దాటాక తెప్ప తగలేసేవాళ్లు బాగుపడిన చరిత్ర లేదు" అన్నారు. ఇది సామెత కాదని.. కాలం కాచి వడబోసిన సత్యమని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అధికార పార్టీవారికి తెలియజేస్తూనే ఉంటుందని.. అయినా ఇలాంటి హోర్డింగ్‌లు, ఇలాంటి జీవోలు జారీ చేస్తూ సభ్య సమాజానికి మీరు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు బొలిశెట్టి సత్యనారాయణ. తాను #JustAsking అంటూ దురుద్దేశంతో విమర్శించే ప్రకాష్ వంటి హిందూ వ్యతిరేకిని కాదని.. గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తిని, కూటమి శ్రేయోభిలాషిగా చెబుతున్నానన్నారు. కూటమికి పదిహేనేళ్ల పాటు ప్రజల మద్దతు కావాలంటే