ఏపీలో ఆటోమోటివ్ ఈవీ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం
Actor ProfilePolitician

ఏపీలో ఆటోమోటివ్ ఈవీ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో ఆటోమోటివ్ ఈవీ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం
Telugu Times23 Oct 2026
ఏపీలో ఆటోమోటివ్ ఈవీ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం

పుంగనూరులో ఈవీ క్లస్టర్, ప్రతి 30 కి.మీ.లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఈవీ మాగ్నెట్ ల కోసం కేంద్రం సహకారంతో రేర్ ఎర్త్ కారిడార్ కియా, శ్రీసిటీ సమీపంలో ఆటో కాంపోనెంట్ పార్క్ ల అభివృద్ధి కొరియా ఆటో ఇండస్ట్రీస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ సియోల్ (సౌత్ కొరియా): సుస్థిర ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 కింద ఆంధ్రప్రదేశ్ లో విస్తృతమైన ఆటోమోటివ్ ఈవీ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం, ఇందులో కొరియన్ సంస్థలు భాగస్వామ్యం వహించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ (KAICA) ఛైర్మన్ టేక్-సుంగ్ లీ (Mr. Taek-sung Lee) నేతృత్వంలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఈవీ ఎకో సిస్టమ్ అభివృద్ధిలో భాగంగా పూర్తి ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ విద్యుదీకరణ, గ్రీన్ కారిడార్లలో ప్రతి 30 కి.మీ.కు ఛార్జింగ్ స్టేషన్లు, ఈ-మొబిలిటీ నగరాలకు ఈవీ ఆర్&డీ గ్రాంటు, పుంగనూరు ఈవీ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈవీ మాగ్నెట్‌ల కోసం ఏపీలో కేంద్రప్రభుత్వ సహకారంతో రేర్ ఎర్త్ కారిడార్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. చెన్నె-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో 100 కి.మీ.ల పరిధిలో ఆటోమోటివ్ విడిభాగాల ఎకోసిస్టంను అభివృద్ధి చేస్తున్నాం, ఇందులో కియా, దాని అనుబంధ సంస్థలతోపాటు అశోక్ లేలాండ్, ఇసుజీ మోటార్స్, హీరో మోటో కార్ప్, అమర్ రాజా, అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్ వంటి ప్రధాన సంస్థలు అంతర్భాగంగా ఉన్నాయని చెప్పారు. అశోక్ లేలాండ్ సంస్థ ₹2,500 కోట్లతో లిథియం అయాన్ ఈ-బస్ ప్లాంట్ ఏర్పాటుచేస్తోందని తెలిపారు