ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. రేపే అర్హులకు పాస్ పుస్తకాల పంపిణీ
Actor ProfilePolitician

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. రేపే అర్హులకు పాస్ పుస్తకాల పంపిణీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. రేపే అర్హులకు పాస్ పుస్తకాల పంపిణీ
10TV Telugu12 Oct 2026
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. రేపే అర్హులకు పాస్ పుస్తకాల పంపిణీ

రేపే చంద్రబాబు బనగానపల్లె పర్యటన రైతన్నలతో సీఎం ముఖాముఖి కార్యక్రమం అర్హులకు పాస్ పుస్తకాల పంపిణీ Land Bass Book: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో రేపు పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన అధికారిక మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటన కోసం నంద్యాల జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ బనగానపల్లెలో భారీ బందోబస్తుతో పాటు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాయి. స్థానిక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నేతలు కూడా ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. Mamata Banerjee: కంట్రోల్ తప్పిన మమతా బెనర్జీ.. కార్యకర్త చెంప చెల్లుమనిపించింది షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 11:20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బనగానపల్లెకు చేరుకుంటారు. అక్కడి నుండి ఉదయం 11:40 గంటలకు నేరుగా బనగానపల్లె తహశీల్దార్ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ స్థానిక ప్రజలు, వివిధ వర్గాల రైతన్నలతో నేరుగా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన ‘ప్రజావేదిక’ బహిరంగ సభలో పాల్గొని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పట్టాదారు పాస్ పుస్తకాల(Land Bass Book)ను స్వయంగా పంపిణీ చేయనున్నారు. ఈ ప్రభుత్వ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2:35 గంటలకు బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ అంతర్గత సమావేశం ముగిసిన అనంతరం, సాయంత్రం 4:20 గంటలకు బనగానపల్లె నుండి తిరిగి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసానికి సీఎం చంద్రబాబు బయల్దేరుతారు