
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. AP Govt Schemes: కాన్పుల మధ్య తగిన విరామం పాటించడం, అవాంఛిత గర్భధారణలను నివారించడం, కుటుంబ నియంత్రణ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జూలై 11 నుంచి 18వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ‘పిల్లల మధ్య ఎడం పాటిద్దాం.. ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం’ అనే నినాదంతో ఈసారి ప్రచారం సాగనుందన్నారు. గర్భధారణకు సరైన సమయాన్ని ఎంచుకోవడం, కాన్పుల మధ్య తగిన విరామం పాటించడం వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలు కలుగుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన దంపతులకు నగదు పురస్కారాన్ని అందచేయనున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రతి జిల్లాలో మూడు జంటలకు (మొత్తం 54 జంటలు) రూ.5 వేల చొప్పున నగదును అందచేస్తామని తెలిపారు. అదేవిధంగా కాన్పు, కాన్పునకు మధ్య కనీసం రెండేళ్లపాటు ఎడమ పాటించిన దంపతులకు కూడా నగదు పురస్కారాన్ని ఇస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో ఆరు జంటలకు పై విధంగానే రూ.5 వేల చొప్పున నగదు అందజేస్తామన్నారు. ఎక్కువ మంది ఉంటే లక్కీ డిప్ ద్వారా లబ్ధిదారులను ఎoపిక చేస్తామని తెలిపారు. కాన్పు, కాన్పునకు మధ్య కనీసం రెండేళ్ల వరకు విరామం పాటిస్తే తల్లీబిడ్డల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ విధానాన్ని పాటిస్తే మాతృత్వ మరణాల్లో 30 శాతం, శిశు మరణాల్లో