ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Actor ProfilePolitician

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

📊 Box Office Collections
Total News9
Movie Updates0
Sources4
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telugu Times9 Jan 2027
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణీకరణను వేగవంతం చేయడంతో పాటు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మూడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను (UDA) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటైన వాటిలో మార్కాపురం, భీమవరం, మరియు నంద్యాల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు ఉన్నాయి. ఇటీవలే జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడటంతో, తాజాగా ప్రభుత్వం వీటికి సంబంధించిన జీవోలను విడుదల చేసింది. కొత్త అథారిటీల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిని కూడా ప్రభుత్వం భారీగా విస్తరించింది. ఒంగోలు, నెల్లూరు, మచిలీపట్నం, మరియు పుట్టపర్తి నగరాల పరిధిలోకి మరికొన్ని కొత్త ప్రాంతాలను, సమీప గ్రామాలను చేరుస్తూ పరిధిని పెంచారు. వీటితో పాటు తిరుపతి (TUDA), ఏలూరు, చిత్తూరు, బాపట్ల, మరియు కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల (UDA) పరిధిని కూడా విస్తరిస్తూ ప్రభుత్వం రీ-ఆర్గనైజేషన్ చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కానుంది. కొత్త ప్రాంతాలు అథారిటీల పరిధిలోకి రావడం వల్ల మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, రోడ్ల విస్తరణ, తాగునీరు, డ్రైనేజీ వంటి పౌర వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరిధి విస్తరణ ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు రావడంతో పాటు, స్థానికంగా ఉపాధి అవకాశాలు మరియు ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు

ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి.. చిరంజీవి అభినందనలు
Samayam Telugu4 Jan 2027
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి.. చిరంజీవి అభినందనలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు,ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి దక్కింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబును ఏపీ ప్రభుత్వం నియమించింది. నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు

జొన్నగిరి గోల్డ్ మైన్స్ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telugu Times6 Nov 2026
జొన్నగిరి గోల్డ్ మైన్స్ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Ap Government) రాష్ట్రంలో పారిశ్రామిక మరియు గనుల రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ ‘జొన్నగిరి గోల్డ్ మైన్స్'(Jonnagiri Gold

విశాఖలో కొత్తగా వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. 13 ఎకరాల్లో, రూ.713 కోట్లతో
Samayam Telugu6 Nov 2026
విశాఖలో కొత్తగా వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. 13 ఎకరాల్లో, రూ.713 కోట్లతో

విశాఖపట్నంలో వెయ్యి పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నారు. అదానీ ఫౌండేషన్ ఈ ఆస్పత్రిని నిర్మించేందుకు ముందుకు వచ్చింది.. ఈ మేరకు అవసరమైన భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించింది. విశాఖపట్నం

తల్లికి వందనం నిధుల జమ ఆ రోజునే - తాజా నిర్ణయం
Oneindia Telugu25 Oct 2026
తల్లికి వందనం నిధుల జమ ఆ రోజునే - తాజా నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం రెండో విడత నిధుల జమ తేదీ పైన స్పష్టత వస్తోంది. ప్రభుత్వం తొలుత ఈ నెల 17,18,19 తేదీల్లో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్

ఉద్యోగులకు బిగ్ అలర్ట్ - స్థానిక కేడర్ల పై మార్గదర్శకాలు జారీ, ఇక నుంచి
Oneindia Telugu27 Sept 2026
ఉద్యోగులకు బిగ్ అలర్ట్ - స్థానిక కేడర్ల పై మార్గదర్శకాలు జారీ, ఇక నుంచి

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల స్థానిక కేడర్ల లో పోస్టుల కేటాయింపు పై తుది మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కేడర్ నిర్ణయంచేలా స్పష్టత ఇచ్చింది. జోన్లు

రూ.450 కోట్ల రుషికొండ భవనాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AP7AM9 Sept 2026
రూ.450 కోట్ల రుషికొండ భవనాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

విశాఖపట్నంలో నిర్మించిన వివాదాస్పద రుషికొండ పర్యాటక భవనాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.450 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ

అంతర్జాతీయ ప్రమాణాలతో బ్లూఫాగ్ బీచ్ గా ఏపీలోని ఆ బీచ్
Oneindia Telugu5 Sept 2026
అంతర్జాతీయ ప్రమాణాలతో బ్లూఫాగ్ బీచ్ గా ఏపీలోని ఆ బీచ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి శతవిధాల కృషి చేస్తుంది. ఇందులో భాగంగా బాపట్లలోని సూర్యలంక బీచ్ ను బ్లూ ఫాగ్ బీచ్ గా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

రేపే రిటైర్ మెంట్.. ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Samayam Telugu17 Aug 2026
రేపే రిటైర్ మెంట్.. ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30వ తేదీ పీవీ సునీల్ కుమార్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. సోమవారం ఆయనను సర్వీస్ నుంచి రిలీవ్