ఏపీకి మరో భారీ రైల్వే ప్రాజెక్టు.. రూ. 2
Actor ProfilePolitician

ఏపీకి మరో భారీ రైల్వే ప్రాజెక్టు.. రూ. 2

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఏపీకి మరో భారీ రైల్వే ప్రాజెక్టు.. రూ. 2,229 కోట్ల వ్యయం.. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం
10TV Telugu19 Jan 2027
ఏపీకి మరో భారీ రైల్వే ప్రాజెక్టు.. రూ. 2,229 కోట్ల వ్యయం.. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం

Gudur-Gummidipoondi Railway: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రైల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు గూడూరు-గుమ్మిడిపుండి సెక్షన్ మధ్య రూ. 2,229 కోట్ల వ్యయంతో మరో రెండు (3, 4వ) కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌తో పాటు ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్‌లో ఈ మార్గం అత్యంత కీలకమైనదిగా మారనుంది. గూడూరు నుంచి గుమ్మిడిపుండి (Gudur-Gummidipoondi Railway)మధ్య 90 కిలోమీటర్ల పొడవునా సాగే ఈ ప్రాజెక్టును రాబోయే నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణంలో భాగంగా స్వర్ణముఖి నదిపై ఒక భారీ బ్రిడ్జి, 21 పెద్ద వంతెనలు, 127 చిన్న వంతెనలతో పాటు 34 ఆర్వోబీ లేదా ఆర్‌యూబీలను నిర్మించనున్నారు. ఈ కొత్త లైన్ల వల్ల పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల అభయారణ్యం వంటి పర్యాటక ప్రాంతాలకు రవాణా సౌకర్యం మరింత సులువవుతుంది. ఈ ప్రాజెక్టుతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం రూ. 9,450 కోట్ల అంచనా వ్యయంతో 4 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల భారతీయ రైల్వే నెట్‌వర్క్ మరో 410 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. దాదాపు 6,448 గ్రామాలకు చెందిన 60 లక్షల మంది జనాభాకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. 2030-31 నాటికి ఈ విస్తరణ లక్ష్యాలను పూర్తిగా సాధిస్తామని కేంద్రం స్పష్టం చేసింది

రూ.20 లంచం కేసు.. 30 ఏళ్ల తర్వాత సుప్రీం తీర్పు.. ఉద్యోగుల విడుదల
10TV Telugu19 Jan 2027
రూ.20 లంచం కేసు.. 30 ఏళ్ల తర్వాత సుప్రీం తీర్పు.. ఉద్యోగుల విడుదల

రూ.20 లంచం కేసు కొట్టివేత 30 ఏళ్లకు ఉద్యోగుల విముక్తి సుప్రీంకోర్టు సంచలన తుది తీర్పు Supreme Court: కేవలం రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణపై ముప్పై ఏళ్లుగా సాగిన సుదీర్ఘ న్యాయపోరాటానికి